Pushpa 2: స్పెషల్ సాంగ్ షూటింగ్ క్యాన్సిల్ అయిందా, షూటింగ్ వాయిదా పడిందా?

ABN , Publish Date - Jul 01 , 2024 | 06:40 PM

ఈవారంలో తీయాల్సిన ఐటెం సాంగ్ చిత్రీకరణ వాయిదా పడిందని, అలాగే కొన్ని కాంబినేషన్ సన్నివేశాలు కూడా వాయిదా వేశారని తెలిసింది. ఇవన్నీ సినిమా విడుదల వాయిదా పడటంతో జరిగిందని, ఇలా అయితే డిసెంబర్ లో అయినా విడుదల అవుతుందా అనే చర్చ పరిశ్రమలో నడుస్తోంది

Pushpa 2: స్పెషల్ సాంగ్ షూటింగ్ క్యాన్సిల్ అయిందా, షూటింగ్ వాయిదా పడిందా?
Allu Arjun from Pushpa 2

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' సినిమా ఈ ఆగస్టు 15న ముందుగా విడుదల కావాల్సి వుంది. కానీ చిత్రీకరణ పూర్తికాని సందర్భంగా ఈ సినిమా విడుదలని డిసెంబర్ కి వాయిదా వేశారు. ఇలా వాయిదా విడుదల పడటంతో ఈ సినిమా నిర్మాతలకి కొంచెం ఇబ్బందిగానే వుంది అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. ఎందుకంటే అనుకున్న సమయానికి ఒక చిత్రం విడుదల కాకపోతే ఆ నిర్మాతలపై ఆర్థికభారం ఎక్కువగా పడే అవకాశం వుంది. (Item song of 'Pushpa 2' supposed to shoot in this week, is cancelled due to the film's release postponed, says sources)

అయితే ఎలాగు ఆగస్టు 15న విడుదల కావటం లేదు, డిసెంబర్ కి వాయిదా వేసేశారు అని ఇప్పుడు చిత్ర నిర్వాహకులు కొంచెం అలసత్వంతో వున్నట్టుగా పరిశ్రమలో టాక్. ఎందుకంటే గత నెలలో మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్ చాలా రోజులు ఈ సినిమా చిత్రీకరణకు కేటాయించాడని తెలిసింది. అయితే దర్శకుడుకి కొంచెం జ్వరంగా ఉండటం, ఆ తరువాత ఫహాద్ ఫాజిల్ కి కొంచెం నలతగా ఉండటంతో చిత్రీకరణ మూడు నాలుగు రోజులు వాయిదా వేశారు. (Pushpa 2 item song shoot cancelled, says sources)

Pushpa.jpg

ఇలా వాయిదా వేసినప్పుడే ఈ సినిమా విడుదల డిసెంబర్ కి వాయిదా పడిందని అధికారికంగా ప్రకటించడంతో మొత్తం చిత్రీకరణ వాయిదా వేశారని తెలిసింది. ఎలాగూ వాయిదా పడిందని, ఆ సన్నివేశాలని తాపీగా తీయొచ్చు అని, ఎందుకంటే ఇంకా చాలా సమయం వుంది అని నిర్వాహకులు అనుకున్నారని ఒక వార్త. అలాగే ఈవారంలో స్పెషల్ పాట చిత్రీకరణ కూడా జరగాల్సి ఉందని, అయితే అది కూడా నిరవధికంగా వాయిదా పడింది అని సమాచారం. ఎందుకంటే ఆగస్టు విడుదల అనుకున్నప్పుడు, ఈవారం స్పెషల్ పాట చిత్రీకరణ చెయ్యాలని అనుకున్నారు, ఇప్పుడు అది వాయిదా వేశారు.

ఇలా ముఖ్యమైన సన్నివేశాలు అన్నీ వాయిదా వేసుకుంటూ వెళితే, అసలు డిసెంబర్ కైనా కరెక్టుగా విడుదల చేస్తారా లేదా అనే సందేహం అటు అల్లు అర్జున్ అభిమానుల్లో, సినిమా ప్రేక్షకుల్లో, పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఇవన్నీ కాకుండా అల్లు అర్జున్ పై కొన్ని పోరాట సన్నివేశాలు తీయాల్సి ఉందని, వాటికి చాలా రోజులు సమయం పట్టే అవకాశం ఉందని, అవన్నీ ఎప్పుడు మొదలుపెడతారు, ఎప్పుడు తీస్తారు అని ఇంకో చర్చ నడుస్తోంది. ఎందుకంటే పోరాట సన్నివేశాలకి చాలా సమయం పడుతుందని అంటున్నారు. అందులోకి ఈ సినిమా పోరాట సన్నివేశాల్లో చాలా లారీలు వుపయోగించి తీస్తారని, అదీ అడవిలో తీయాల్సి ఉందని అంటున్నారు.

1allu-sukumar.jpg

ఇందులో కథానాయిక రష్మిక మందన్న ఇప్ప్పుడు హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది, సల్మాన్ ఖాన్ తో సినిమా కూడా చేస్తోంది, అలాగే ఇంకా కొన్ని హిందీ సినిమాలు కూడా ఒప్పుకుంది. వీటితో పాటు తెలుగు, తమిళ సినిమాలు కూడా కొన్ని చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమా వాయిదా వేయటంతో ఆమె తేదీలు మళ్ళీ దొరకటం కష్టం అని కూడా అంటున్నారు. ఫహాద్ ఫాజిల్ మలయాళం సినిమాలతో పాటుగా వేరే తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు ఒప్పుకున్నాడు, వాటికి కూడా అతను తేదీలు ఇవ్వాల్సి వుంది. ఇప్పుడు 'పుష్ప 2' వాయిదా పడటంతో కాంబినేషన్ సన్నివేశాలకి అవసరమైన నటుల తేదీలు దొరకాలంటే కష్టమే అని కూడా వినిపిస్తోంది. మరి ఇవన్నీ అధిగమించి 'పుష్ప 2' చిత్రీకరణ పూర్తి చేసుకొని డిసెంబర్ లో అయినా విడుదల చేస్తారా అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.

'పుష్ప' మొదటి భాగం మూడేళ్ళ క్రితం అంటే 2021 డిసెంబర్ 17న విడుదలయింది. అంటే మళ్ళీ మూడేళ్ళ తరువాత ఈ రెండో భాగం విడుదలవుతోంది. మరి దీనికి మూడో భాగం కూడా వుంది అంటున్నారు, మరి నిజంగానే ఉంటుందా, 'పుష్ప 2' తోటే సరిపెట్టేస్తారా, ఒకవేళ రెండో భాగంతో సరిపెట్టేస్తే చిత్రీకరణ కూడా వేరేలా చెయ్యాలి అని చర్చ. ఇందులో కథానాయకుడు అల్లు అర్జున్ ఆ ఫిజిక్, గెడ్డం అన్నీ ఈ సినిమా పూర్తయ్యేవరకు అలాగే ఉంచాలి. ఒక పెద్ద బడ్జెట్ సినిమా విడుదలలో జాప్యం జరిగితే ఎన్ని కష్టాలో మరి!

Updated Date - Jul 01 , 2024 | 06:41 PM