Earthquake: జపాన్‌లో భూకంపం.. 28వ అంతస్తులో రాజమౌళి ఫ్యామిలీ..!
ABN , Publish Date - Mar 21 , 2024 | 11:17 AM
దర్శకధీరుడు రాజమౌళి ఫ్యామిలీ జపాన్‌లో భూకంపం నుండి సేవ్ అయినట్లుగా.. తాజాగా రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ జపాన్‌లో కూడా విడుదలై విజయం సాధించింది. ఈ విజయాన్ని అక్కడి ప్రేక్షకులతో కలసి ఆస్వాదించడానికి రాజమౌళి అండ్ ఫ్యామిలీ ఇటీవలే జపాన్ వెళ్లి, అక్కడ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటోంది. అయితే గురువారం జపాన్‌లో భూకంపం వచ్చిందని.. అప్పుడు మేమంతా భయపడ్డామని తాజాగా కార్తికేయ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఫ్యామిలీ జపాన్‌లో భూకంపం (Earthquake in Japan) నుండి సేవ్ అయినట్లుగా.. తాజాగా రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ (SS Karthikeya) ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకల సందర్భంగా గత ఏడాది ఆస్కార్ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చిత్రం సృష్టించిన సందర్భాన్ని అందరూ మరోసారి గుర్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జపాన్‌లో కూడా విడుదలై విజయం సాధించింది. ఈ విజయాన్ని అక్కడి ప్రేక్షకులతో కలసి ఆస్వాదించడానికి రాజమౌళి అండ్ ఫ్యామిలీ ఇటీవలే జపాన్ వెళ్లి, అక్కడ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటోంది. అయితే గురువారం జపాన్‌లో భూకంపం వచ్చిందని.. అప్పుడు మేమంతా భయపడ్డామని కార్తికేయ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.
‘‘ఇప్పుడే జపాన్‌లో భయంకరమైన భూకంపం వచ్చింది. మేమంతా 28వ అంతస్తులో ఉన్నప్పుడు.. భూమి నెమ్మదిగా కదలడం గమనించాం. ఇది భూకంపం అని గ్రహించడానికి మాకు కొంత టైమ్ పట్టింది. మేమంతా ఒకవైపు భయపడుతుంటే.. జపాన్ వాళ్లు మాత్రం అసలు పట్టించుకోకుండా.. ఏదో వర్షం పడుతున్నట్లుగా వారి పని వారు చేసుకుంటున్నారు. భూకంపాన్ని ఫీల్ అయ్యే కోరిక తీరింది..’’ అని చెబుతూ ఆ బాక్స్‌లో ఎస్ టిక్ పెట్టారు. అంతేకాదు, భూకంపం రాబోతున్నట్లుగా ముందే వచ్చిన వార్నింగ్ మెసేజ్‌ని కూడా కార్తికేయ ఈ పోస్ట్‌లో చూపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. (SS Karthikeya Post on Earthquake in Japan)
అయితే సడెన్‌గా జపాన్‌లో భూకంపం, రాజమౌళి ఫ్యామిలీ అక్కడే ఉందని తెలుసుకున్నవాళ్లంగా కాస్త కంగారు పడ్డారు. కానీ, కార్తికేయ ట్వీట్‌తో వారంతా సేఫ్‌గా ఉన్నారని తెలిసి అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. వాస్తవానికి జపాన్‌లో భూకంపాలు రావడం అనేది సర్వ సాధారణం. జపాన్ ప్రజలకు అవి అలవాటే. కానీ రాజమౌళి అండ్ ఫ్యామిలీ (Rajamouli and Family) అక్కడ ఉండటంతో.. అంతా కాస్త భయపడ్డారు. అయితే వచ్చింది స్వల్ప భూకంపమే కావడంతో.. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. అంతా సేఫ్‌గానే ఉన్నామని తెలియజేసేందుకే కార్తికేయ ఈ ట్వీట్ చేశారని.. రాజమౌళి ఫ్యాన్స్ భావిస్తూ.. జాగ్రత్త అనేలా కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Suriya: ఈ యేడాది విడుదలకానున్న సూర్య రెండు చిత్రాలు
***************************
*Ilaiyaraaja Biopic: ఇళయరాజా బయోపిక్.. అధికారిక ప్రకటన వచ్చేసింది
************************
*RC16: ఘనంగా ‘RC16’ ప్రారంభం.. ఫొటోలు వైరల్
********************************
*Ashwatthama: ‘హనుమాన్’ వంటి మరో చిరంజీవి కథ.. హీరో ఎవరంటే?
***************************