OG Team: పొలిటికల్ సభల్లో ‘ఓజీ’ అంటూ ఆయన్ని ఇబ్బంది పెట్టకండ్రా..
ABN , Publish Date - Dec 28 , 2024 | 09:37 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని ఇబ్బంది పెట్టకండి అంటూ సూచన చేశారు ‘ఓజీ’ మూవీ నిర్మాణ సంస్థ నిర్మాతలు. ట్విట్టర్ వేదికగా అభిమానులకు వారొక మెసేజ్‌ను విడుదల చేశారు. ఈ మెసేజ్‌లో ఏముందంటే..
‘ఓజీ అంటూ ఆయన్ని ఇబ్బంది పెట్టకండ్రా.. ఇంకొంచెం టైమ్ ఉంది.. అల్లాడిద్దాం థియేటర్స్‌లో..’ అంటూ డివివి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఓ మెసేజ్‌ని విడుదల చేసింది. ఈ మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యే ప్రతి పొలిటికల్ ఫంక్షన్‌లో ఫ్యాన్స్.. ‘ఓజీ ఓజీ’ అంటూ అరుస్తూ.. ఆయన స్పీచ్‌కు అడ్డుపడుతున్న విషయం తెలిసిందే. అలా చేయవద్దంటూ.. ఓజీ ఫ్యాన్స్‌కు నిర్మాణ సంస్థ సూచన చేసింది. ఆయన రాష్ట్ర భవిష్యత్ కోసం ఎంతో కష్టపడుతున్నారు.. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించండి అంటూ హితబోధ చేసింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేసిన మెసేజ్ ఏంటంటే..
Also Read- Game Changer: ‘గేమ్ చేంజర్’ యూనిట్‌కు రామ్ చరణ్ ఫ్యాన్ వార్నింగ్
‘‘OG సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాము. ఓజీ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పని చేస్తున్నాం. కానీ మీరు పవన్ కళ్యాణ్‌గారు పొలిటికల్ సభలకు వెళ్లినప్పుడు, సమయం, సందర్భం చూడకుండా ఓజీ ఓజీ అని అరవడం, వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్ కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత, అందుకని ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం. 2025లో ఓజీ పండుగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం’’ అని అభిమానులకు తెలియజేశారు.
దీనికి ఫ్యాన్స్ కూడా అలాగే రియాక్ట్ అవుతున్నారు. ‘‘ఆయన్ని ఇబ్బంది పెట్టం మావా.. నువ్వు ఏదో ఒక అప్డేట్ ఇస్తే చాలు.. దాంతో ఈ న్యూ ఇయర్‌కి వెల్‌కమ్ చెప్తాం.. ప్లీజ్ ఏదైనా ఒక అప్డేట్..’’, ‘‘ఓకే మావా.. అల్లాడిద్దాం’’ అంటూ డివివి సంస్థ చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మొత్తంగా ఈ సంభాషణతో ‘ఓజీ’ టైటిల్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన కథానాయిక. ఇమ్రాన్ హాస్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.