S.S.Karthikeya: సెంటిమెంట్ బ్రేక్ అయినట్లేనా?
ABN , Publish Date - Sep 28 , 2024 | 02:07 PM
23 ఏళ్ల సెంటిమెంట్‌ని తారక్ బ్రేక్ చేశాడా? కార్తికేయ ఏమన్నాడు? అభిమానులెందుకు కార్తికేయతో విభేదిస్తున్నారంటే...
ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్(NTR) సోలో హీరోగా శుక్రవారం భారీ అంచనాలతో 'దేవర'(Devara) సినిమా రిలీజైంది. మొదటి రోజు అంచనాలకు తగ్గట్లుగానే ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో ఎన్టీయార్ భావోద్వేగానికి గురై అభిమానులకి, మేకర్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కుమారుడు కార్తికేయ(Karthikeya)పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత ఎంతటి స్టార్ హీరోకైనా ప్లాప్ తప్పదు అనే సెంటిమెంట్ ఉంది. అయితే ఈ సెంటిమెంట్‌ని తారక్ బ్రేక్ వేశాడా?
కార్తికేయ ఏమన్నాడంటే.. "23 ఏళ్ల సెంటిమెంట్‌ని తారక్ తొలిసారి బద్దలు కొట్టాడు. నేను సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాను, జై ఎన్టీయార్" అనే సారాంశంతో 'X'లో ట్వీట్ చేశాడు. దీనికి భిన్నంగా సినీ అభిమానులు రియాక్ట్ అవ్వడం విశేషం. ఓ వైపు సినిమాకి నెగిటివ్ టాక్ వస్తుంటే కార్తికేయ ఇలా ఎలా రెస్పాండ్ అవుతారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో కొరటాల పెద్ద దెబ్బేశాడని తారక్ అభిమానులే ఆవేదన చెందటం గమనార్హం. ఒక్క ఎన్టీయార్ ప్రదర్శన మినహా ఏ విషయంలోనూ ఫ్యాన్స్, క్రిటిక్స్ మార్క్‌లు వేయలేకపోయారు. ఫైనల్‌గా కార్తికేయ ఒపీనియన్‌తో మెజారిటీ సినీ అభిమానులు అంగీకరించలేకపోతున్నారు.
సెంటిమెంట్ ఎలా మొదలైందంటే..
జక్కన 'సింహాద్రి' తర్వాత ఎన్టీఆర్‌కు, 'ఛత్రపతి' తర్వాత ప్రభాస్‌కు, మగధీర తర్వాత రామ్ చరణ్‌కు ఫ్లాపులు రావడంతో రాజమౌళి కర్స్ అనే నెగిటివ్ సెంటిమెంట్(Rajamouli curse) ప్రారంభమైంది. మరోసారి 'బాహుబలి' తర్వాత ప్రభాస్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఆచార్య తో రామ్ చరణ్ ప్లాప్ అందుకున్నారు. ఇప్పుడు తారక్ నుండి వచ్చిన 'దేవర' మూవీపై మిక్స్‌డ్ టాక్ నడుస్తోంది. సోలో హీరోగా చూస్తే చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. 'దేవర'పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు అందరి కళ్ళు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌పై పడ్డాయి.