Nayanthara vs Dhanush: నయనతార విషయంలో ధనుష్ అస్సలు తగ్గేదే లే..
ABN , Publish Date - Nov 27 , 2024 | 03:50 PM
లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె భర్త దర్శకుడు విఘ్నేశ్ శివన్‌పై కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దావా వేశారు. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ విషయంలో నయనతార, ధనుష్‌ల మధ్య వివాదం నెలకొన్ని విషయం తెలిసిందే. ధనుష్ అనుమతి లేకుండా అందులో కొన్ని విజువల్స్ వాడటంపై ధనుష్ సీరియస్ అవుతూ.. కోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె భర్త దర్శకుడు విఘ్నేశ్ శివన్‌పై కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దావా వేశారు. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ విజువల్స్‌ను వాడుకోవడంపై ఆయన నిర్మాణసంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నయనతార, విఘ్నేశ్ శివన్‌లతో పాటు వారి నిర్మాణ సంస్థ అయిన రౌడీ పిక్చర్స్‌పై కూడా ధనుష్ దావా వేశారు. బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన మద్రాస్ ధర్మాసనం.. ఈ కేసుపై విచారణకు అంగీకరించింది. దీంతో ఈ విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read-Akkineni Family: ఒకవైపు నాగచైతన్య పెళ్లి.. మరో వైపు అఖిల్ నిశ్చితార్థం
ఇటీవల ఇదే డాక్యుమెంటరీ విషయమై ధనుష్‌కు సోషల్ మీడియా వేదికగా నయనతార బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ధనుష్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ‘ఫ్యాన్స్‌కి సినిమా వేదికలపై నీతులు చెప్పే నీకు.. మిగతా తోటి ఆర్టిస్ట్స్‌తో ఎలా నడుచుకోవాలో తెలీదా’ అంటూ మండిపడ్డారు. 2015లో ‘నానుమ్ రౌడీ ధాన్’ (నేనూ రౌడీనే) అనే చిత్రాన్ని నయనతార, విజయ్ సేతుపతి జంటగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో హీరో ధనుష్ నిర్మించారు. ఈ సినిమాతోనే ప్రేమలో పడ్డ నయనతార, విగ్నేశ్ ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ పెళ్లిని డాక్యుమెంటరీగా చిత్రీకరించి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని నయనతార ఎంతో ఆశపడినప్పటికీ తీవ్ర ఆలస్యం అవుతూ వచ్చింది. దీనికి ప్రధాన కారణం ధనుష్ అని తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీలో నయనతార జీవితంలో ఎంతో ప్రధానమైన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా క్లిప్స్, లిరిక్స్ వాడుకునేందుకు ధనుష్ నిరాకరించాడు. అలాగే ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సినిమాలోని 3 సెకన్ల విజువల్స్ వాడుకున్నందుకు ధనుష్ రూ. 10 కోట్లు డిమాండ్ చేసినట్లుగా నయనతార తన లేఖలో పేర్కొంటూ ధనుష్‌పై ఫైర్ అయ్యింది. అంతే అప్పటి నుండి ఈ డాక్యుమెంటరీ వ్యవహరం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read- Zulfi Ravdjee: అఖిల్ మామ చాలా రిచ్.. దుబాయ్‌లో పెద్ద
ధనుష్ అడ్డు చెప్పినా.. నయనతార డేరింగ్‌గా ఈ డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయించింది. దీంతో హర్ట్ అయిన ధనుష్.. వారిపై కోర్టులో దావా వేశారు. ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ విషయానికి వస్తే.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ సక్సెస్‌పుల్‌గా రన్ అవుతూ.. టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. ఇందులో నయనతార కెరీర్‌ను, ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలను ఇందులో చూపించారు. ఇంకా విఘ్నేశ్‌తో ప్రేమ, పెళ్లి వంటి వాటిని చూపించే విషయంలో ‘నానుమ్ రౌడీ దాన్’ ఎంతో కీలకమైన పాత్ర పోషించడంతో.. ఆ సినిమా విజువల్స్‌ని ఇందులో చూపించడమే.. ధనుష్ కోపానికి కారణమైంది.