Devara: ‘దేవర’.. విడుదలైన ఎన్ని రోజులకు ఓటీటీలోకి వస్తుందంటే..

ABN , Publish Date - Sep 25 , 2024 | 09:40 PM

నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న సినిమా ‘దేవర’. మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఒకవైపు రిలీజ్‌కు సంబంధించి హడావుడి జరుగుతుంటే.. మరోవైపు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘దేవర’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Devara Movie Still

నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న సినిమా ‘దేవర’ (Devara). మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) నుంచి 6 సంవత్సరాల తర్వాత సోలో మూవీగా ఈ మూవీ థియేటర్లలోకి సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. కొరటాల శివ (Koratala Siva) ఈ చిత్రానికి దర్శకుడు.

Also Read- Devara: వార్స్ వద్దు.. ‘దేవర’ అభిమానులకు నిర్మాత నాగవంశీ రిక్వెస్ట్

ఇక ఈ సినిమాను ఓటీటీలో చూడాలంటే 50 రోజులు వేచి చూడాల్సిందే అనేలా ఓ వార్త సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా హిందీ బాషలోనూ దేశవ్యాప్తంగా ఉన్న మల్టిప్లెక్స్‌లలో రిలీజ్ కానుంది. అయితే హిందీ సినిమా- మల్టిప్లెక్స్ చైన్‌లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంది. దీంతో ఓటీటీలోకి ‘దేవర’ రావాలంటే విడుదలైన రోజునుండి కనీసం 50 రోజులు పడుతుంది. టాక్ పాజిటివ్‌గా వస్తే మాత్రం కచ్చితంగా ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి 8 వారాలకు పైనే పట్టొచ్చు. టాక్ తేడా కొడితే మాత్రం చెప్పలేం. (Devara OTT)


devara-Movie.jpg

జూనియర్ ఎన్టీయార్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించారు. హిందీ బెల్ట్ ఆడియెన్స్‌ని థియేటర్లకి రప్పించడానికి ఈ కెపాసిటీ సరిపోతుంది. వీరితో పాటు శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, మురళి శర్మ, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్, శృతి మరాఠే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 400 కోట్లతో నిర్మాణమైన ఈ సినిమా ఇప్పటికే 350 కోట్ల రికవరీని సాధించినట్లుగా టాక్ వినబడుతోంది. ఇంకా అన్ని భాషల శాటిలైట్ రైట్స్, బాలీవుడ్ రిలీజ్ నుంచి కూడా భారీగా ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి.

Also Read- Prakash Raj: ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ మరోసారి పవన్‌ కళ్యాణ్‌కు కౌంటర్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 25 , 2024 | 09:40 PM