CPI Narayana: నాగార్జునకు పరువు ఎక్కడిది

ABN , Publish Date - Oct 13 , 2024 | 06:32 PM

నాగార్జునకు పరువు లేదని ఆయన పరువు నష్టం పిటిషన్‌ దాఖ?ని చేయడానికి అనర్హుడని సీపీఐ సీనియర్‌ నేత నారాయణ విమర్శించారు. సమంతకు ఆ హక్కు ఉందని ఆయన అన్నారు.


నాగార్జునకు (Nagarjuna) పరువు లేదని ఆయన పరువు నష్టం పిటిషన్‌ దాఖలు చేయడానికి అనర్హుడని సీపీఐ సీనియర్‌ నేత నారాయణ (CPI Narayana) విమర్శించారు. సమంతకు (Samantha) ఆ హక్కు ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వేదికపై మాట్లాడుతూ "నాగార్జునకు పరువు ఎందుకు లేదంటే.. ఆయన బిగ్‌ బాస్‌ షోకు హోస్ట్‌ గా ఉంటూ పరువు మొత్తం పోగొట్టుకున్నారు. అందుకే ఆయనకు పరువు లేదు. అందుకే ఆయన పరువు నష్టం దావా వేసే అర్హత ఆయనకు లేదు’’ అని అన్నారు. తన కుటుంబంపై కొండా సురేఖ (Konda surekha) చేసిన వ్యాఖ్యలకు  అక్కినేని కుటుంబం (Akkineni Family) మొత్తం స్పందించింది. యావత్తు ఇండస్ట్రీ నాగార్జున కుటుంబం వైపు నిలచింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై రూ. వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు నాగ్‌.  కొంత మంది వాంగ్మూలాలను కోర్టులో నమోదు చేశారు. అయితే సమంత మాత్రం ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు. నిజానికి కొండా సురేఖ సమంతను పొగిడారని .. నాగార్జున కుటుంబాన్ని మాత్రమే విమర్శించారన్న మాటలు వినిపిస్తున్నాయి.

అయితే సీపీఐ నారాయణ బిగ్‌ బాస్‌ షోపై వ్యతిరేకత చూపడం ఇదే తొలిసారి కాదు. బిగ్‌ బాస్‌ షో పై వ్యతిరేకతతో నాగార్జునపై ఇలా మాట్లాడుతున్నారా లేకపోతే.. నాగార్జునతో పాత గొడవలు ఏమైనా ఉన్నాయా అని ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు. నారాయణ మాత్రం చాన్స్‌ వచ్చినప్పుడల్లా నాగ్‌ను టార్గెట్‌ చేస్తున్నారు.  

Updated Date - Oct 13 , 2024 | 06:35 PM