IFFA 2004: ఘనంగా ఐఫా వేడుకలు.. విజేతలు వీరే
ABN , Publish Date - Sep 28 , 2024 | 12:16 PM
ఐఫా 2024 (IFFA 2024) సినీ పండగ అబుదాబి వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. దక్షిణాది, ఉత్తరాది తారలు ఈ వేడుకలో సందడి చేస్తున్నారు.
ఐఫా 2024 (IFFA 2024) సినీ పండగ అబుదాబి వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. దక్షిణాది, ఉత్తరాది తారలు ఈ వేడుకలో సందడి చేస్తున్నారు. చిరంజీవి (Chiranjeevi) ‘ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ (Outstanding Achievement in Indian Cinema) పురస్కారం’ అందుకోగా సమంత వుమెన్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నారు.
Satyam Sundaram Review: కార్తీ నటించిన 'సత్యం సుందరం' సినిమా ఎలా ఉందంటే..
(చిరంజీవి, బాలకృష్ణ ఆత్మీయ ఆలింగనం)
గోల్డెన్ లెగసీ అవార్డును కరణ్‌జోహర్ చేతుల మీదుగా బాలకృష్ణ అందుకున్నారు. వేదికపై టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ సందడి చేశారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
(చిరంజీవి, రెహమాన్ తో జయరాం సెల్ఫీ)
విజేతలు వీరే
ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా- చిరంజీవి
ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా - ప్రియదర్శన్
ఉమెన్ ఆఫ్ ది ఇయర్ - సమంత
గోల్డెన్ లెగసీ అవార్డు - బాలకృష్ణ
ఉత్తమ చిత్రం (తమిళం) - జైలర్
(బాలకృష్ణకు గోల్డెన్ లెగసీ అవార్డు అందిస్తోన్న కరణ్ జోహర్)
ఉత్తమ చిత్రం (తెలుగు)- దసరా
ఉత్తమ నటుడు (తెలుగు)- నాని
ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టి
ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ నటి (తమిళం) - ఐశ్వర్యారాయ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ దర్శకుడు (తమిళం) - మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్ 2)
(ఐఫా వేదికపై మణిరత్నం, ఐశ్వర్యారాయ్)
ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) - ఏఆర్ రెహమన్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ విలన్ (తమిళం) - ఎస్‌జే సూర్య (మార్క్ ఆంటోనీ)
ఉత్తమ విలన్ (తెలుగు) - షైన్ టామ్ (దసర)
ఉత్తమ విలన్ (కన్నడ) - జగపతి బాబు
ఉత్తమ సహాయ నటుడు (తమిళం) - జయరామ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
(వుమెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్న సమంత)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి
ఉత్తమ సాహిత్యం - జైలర్ (హుకుం)
ఉత్తమ నేపథ్య గాయకుడు - చిన్నంజిరు (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ నేపథ్య గాయని - శక్తిశ్రీ గోపాలన్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ విలన్ (మలయాళం) - అర్జున్ రాధాకృష్ణన్
(ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ అవార్డుతో రిషబ్ శెట్టి, చిత్రంలో రాక్ లైన్ వెంకటేష్)
(ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) అవార్డును అందుకుంటోన్న ఏఆర్ రెహమాన్)
(చిరంజీవి, బాలకృష్ణ ఆత్మీయ ఆలింగనం)
వేదికపై డ్యాన్స్‌తో ఉర్రూతలూగిస్తోన్న ప్రభుదేవా, ప్రగ్యా జైస్వాల్
(ఉత్తమ విలన్ (కన్నడ) అవార్డును అందుకుంటున్న జగపతి బాబు)
(భార్య వసుంధరతో బాలయ్య)
మరిన్ని సినిమా వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి