Independence Day: స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని స్మరించుకుందాం.. స్టార్స్ ట్వీట్స్

ABN , Publish Date - Aug 15 , 2024 | 01:27 PM

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా ఎగురుతోంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు, ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.. వంటి వారంతా ట్విట్టర్ ఎక్స్‌లో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Celebrities Independence Day Wishes

78వ స్వాతంత్ర్య దినోత్సవ (78th Independence Day) వేడుకలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా ఎగురుతోంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సినీ తారలు (Cine Stars) సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు, ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Young Tiger NTR), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun).. వంటి వారంతా ట్విట్టర్ ఎక్స్‌లో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్స్‌తో టాలీవుడ్ నిర్మాతలు (Tollywood Producers) సందడి చేశారు. ప్రస్తుతం స్టార్స్ చేసిన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ స్వాతంత్య్రం కోసం మన పూర్వీకులు ఎందరో ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారు. వాళ్లందరినీ మరొక్కసారి స్మరించుకుని.. ఆదర్శంగా తీసుకుందాం. జైహింద్‌.. అని చిరంజీవి పోస్ట్‌ (Chiranjeevi Post)లో పేర్కొన్నారు.


78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. జైహింద్ అని పోస్ట్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR X Post).

Also Read- Mr Bachchan Review: ర‌వితేజ.. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఎలా ఉందంటే?


ఈ ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. జైహింద్ అని పోస్ట్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun 78th Independence Day Wishes Post).


చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ పాల్గొని జెండా ఆవిష్కరణ గావించారు. ఇంకా పలువురు సెలబ్రిటీలు, నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.


Amaran.jpg

Committee.jpg

Read Latest Cinema News

Updated Date - Aug 15 , 2024 | 01:27 PM