Sreetej: పెళ్లంటూ మోసం చేశాడని నటుడు శ్రీతేజ్‌పై కేసు

ABN , Publish Date - Nov 26 , 2024 | 01:56 PM

సినీ హీరో శ్రీతేజ్‌పై (Sreetej) కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ లో  కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి గచ్చిబౌలి పోలీసు  స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది.


సినీ హీరో శ్రీతేజ్‌పై (Sreetej) కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ లో  కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి గచ్చిబౌలి పోలీసు  స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీతేజ్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌తో (zero Fir) కూకట్‌పల్లిలో కేసు నమోదు చేశారు. అతడిపై బీఎన్‌ఎస్‌ 69, 115(2), 318(2) సెక్షన్‌ కింద కేసు నమోదైంది. గతంలోనూ కూకట్‌పల్లిలో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పెళ్లయిన మరో వివాహితతో అక్రమ సంబంధంతోపాటు, ఓ బ్యాంక్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌ భార్య అర్చనతో శ్రీతేజ్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అక్రమ సంబంధం విషయం తెలిసి గుండెపోటుతో సురేష్‌  మరణించారు. దీనిపై శ్రీ తేజ్‌పై మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఉంది. ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2) సినిమాలో నటిస్తున్నాడు శ్రీతేజ్‌.

Updated Date - Nov 26 , 2024 | 01:56 PM