BVS Ravi: ఆత్మలని పిలవకుండా.. వాళ్లింట్లోనే పేరంటమా?
ABN , Publish Date - Feb 22 , 2024 | 05:48 PM
ఆత్మలకి కూడా ఆత్మాభిమానం, మనోభావాలు ఉండే రోజులివి. వాళ్లని పిలవకుండా వాళ్ల ఇంట్లో మన పేరంటం పెట్టుకుంటే రేపు వాళ్లు మన ఇంట్లో పెట్టుకోవచ్చు.. ఒక సారి ఆలోచించండి.. అని నిర్మాత కోన వెంకట్‌కు రచయిత బీవీఎస్ రవి సలహా ఇచ్చారు. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ నిర్మిస్తోన్న చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ఈ సినిమా టీజర్‌ను బేగంపేట శ్మశానంలో విడుదల చేస్తున్నట్లుగా కోన వెంకట్ చేసిన ట్వీట్‌కు బీవీఎస్ రవి సరదాగా కామెంట్ చేశారు.
ఆత్మలకి కూడా ఆత్మాభిమానం, మనోభావాలు ఉండే రోజులివి. వాళ్లని పిలవకుండా వాళ్ల ఇంట్లో మన పేరంటం పెట్టుకుంటే రేపు వాళ్లు మన ఇంట్లో పెట్టుకోవచ్చు.. ఒక సారి ఆలోచించండి.. అని నిర్మాత కోన వెంకట్ (Kona Venkat)కు రచయిత బీవీఎస్ రవి (BVS Ravi) సలహా ఇచ్చారు. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ నిర్మిస్తోన్న చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ (Geethanjali Malli Vachindhi). 2014లో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి.. బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ (Geethanjali) సినిమాకు ఇది సీక్వెల్. ‘గీతాంజలి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించటమే కాదు ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి మరెన్నో సినిమాలకు దారి చూపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావటానికి సన్నద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్ర టీజర్‌ని ఫిబ్రవరి 24 రాత్రి 7 గంటలకు బేగంపేట శ్మశానంలో విడుదల చేయబోతున్నట్లుగా కోన వెంకట్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ.. ‘‘కోన వెంకట్ సర్ మీకు పర్సనల్‌గా మెసేజ్ చెయ్యచ్చు కానీ పబ్లిక్‌గా అనౌన్స్ చేశారు కాబట్టి ట్వీట్ చేస్తున్నా.. ఆత్మలకి కూడా ఆత్మాభిమానం, మనోభావాలు ఉండే రోజులివి. వాళ్లని పిలవకుండా వాళ్ల ఇంట్లో మన పేరంటం పెట్టుకుంటే రేపు వాళ్లు మన ఇంట్లో పెట్టుకోవచ్చు.. ఒక సారి ఆలోచించండి..’’ అంటూ రచయిత బీవీఎస్ రవి చేసిన ట్వీట్ (BVS Ravi Tweet) ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిజమే మరి.. బీవీఎస్ రవి చెప్పేది కూడా కరక్టే. ఆత్మలు కనుక హర్ట్ అయితే.. అవి కూడా మనుషుల ఇళ్లలో పేరంటం పెట్టుకుంటే.. అమ్మో.. ఊహించుకుంటేనే హారర్ సినిమా కనబడుతోంది కదా..
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా విషయానికి వస్తే.. అంజలి (Anjali) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా.. ఆమె కెరీర్ మైల్ స్టోన్ మూవీ 50వ చిత్రంగా అలరించనుంది. హారర్ కామెడీ జోనర్ చిత్రాల్లో భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై కూడా అంచనాలను పెంచేసింది. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Rakul Preet Singh: జాకీ భగ్నానీతో ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం
*************************
*Varun Tej: ‘జనసేన’పై వరుణ్ తేజ్.. ఆసక్తికర వ్యాఖ్యలు
*****************************
*Kanguva: ‘కంగువ’ అప్డేట్ వచ్చింది..
************************