Biggboss 8 Promo: కమిట్‌ అయితే లిమిటే లేదు.

ABN , Publish Date - Aug 11 , 2024 | 07:01 PM

తెలుగు రియల్టీ షో బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 8) సరికొత్త సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 8కు సంబంధించిన ప్రోమో ఆదివారం విడుదలైంది.

తెలుగు రియల్టీ షో బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 8) సరికొత్త సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 8కు సంబంధించిన ప్రోమో ఆదివారం విడుదలైంది. అక్కినేని నాగార్జున (Nagarjuna) ఈసారి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కమెడియన్‌ సత్య పాత్రతో ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. దాన్ని కొనసాగిస్తూ ప్రోమోను విడుదల చేశారు. ‘ఈసారి బిగ్‌బాస్‌ సీజన్‌-8లో ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫన్‌, టర్న్‌, ట్విస్ట్‌లకు లిమిటే లేదు’ (Entertainments, Fun, Turns and twists) అంటూ నాగార్జున డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ‘ఇన్ఫినిటీ ఆఫ్‌ ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సిద్థంకండి’ అంటూ ఈ సీజన్‌ సరికొత్తగా అలరించనుందని నాగార్జున చెబుతున్నారు. సీజన్‌-8 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఇంటి సభ్యులు ఎవరెవరు వెళ్లబోతున్నారు అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే! 

Updated Date - Aug 11 , 2024 | 07:23 PM