Prabhas: ప్రభాస్‌ పుట్టిన రోజు.. ఈసారి పెద్ద ట్రీటే..

ABN , Publish Date - Oct 17 , 2024 | 03:12 PM

  ప్రభాస్‌ అభిమానులకు భారీ ట్రీట్‌ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న కొత్త సినిమాల అప్‌డేట్‌లతోపాటు ఆయన గత చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి మేకర్స్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నా

ప్రభాస్‌ (Prabhas) అభిమానులకు భారీ ట్రీట్‌ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న కొత్త సినిమాల అప్‌డేట్‌లతోపాటు ఆయన గత చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి మేకర్స్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభాస్‌ నటించిన అరడజనకు పైగా సినిమాలు రీ రిలీజ్‌ చేయనున్నారు. మిస్టర్‌ పర్ఫెక్ట్‌, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్‌, రెబల్‌, సలార్‌ చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ కానున్నాయి. అక్టోబర్‌ 19, 20 తేదీల్లో సలార్‌ పార్ట్‌ 1 హైదరాబాద్‌లో స్పెషల్‌ షోలు ప్రదర్శించనున్నారు. 22న మిస్టర్‌ పర్ఫెక్ట్‌ చిత్రాన్ని దిల్‌ రాజు రీ రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రభాస్‌ పుట్టినరోజున ఆయన హీరోగా పరిచయమైన 'ఈశ్వర్‌’ రీ రిలీజ్‌ అవుతోంది. ఇప్పటికే ఓసారి రీ రిలీజ్‌ అయిన 'రెబల్‌’ చిత్రం ఈ 23న మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వీటితోపాటు ఛత్రపతి, మిర్చి, సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు స్పెషల్‌ షోలు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.  (Prabhas Birthday special)

Mr.jpg

తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, గుజరాత్‌,  జపాన్‌ వంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక షోలు వేయడానికి ఫ్యాన్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ ఏడాది ప్రభాస్‌ పుట్టినరోజు వేడుకను మరింత ఘనంగా నిర్వహించడానికి అభిమానులు  భారీగా ప్లాన్‌ చేస్తున్నారు.  అదే రోజున ఆయన నటిస్తున్న ురాజా సాబ్‌’ టీజర్‌ను విడుదల చేయనున్నారు. వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. తదుపరి హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న 'ఫౌజీ’ (వర్కింగ్‌ టైటిల్‌) సెట్స్‌లో అడుగుపెట్టానున్నారు ప్రభాస్‌. అలాగే సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్‌' కూడా లైన్లో ఉంది. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత 'కల్కి' సీక్వెల్‌ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈ మూడు సినిమాలకు సంబంధించిన స్పెషల్‌ బర్త్‌ డే పోస్టర్లను విడుదల చేయనున్నారు. 

Eeswar.jpg

Updated Date - Oct 17 , 2024 | 03:12 PM