Ariyana Glory: అరియనా అందాలు, నెటిజన్స్ కామెంట్స్

ABN , Publish Date - Jun 24 , 2024 | 12:57 PM

అరియనా గ్లోరీ అనే ఆమె బిగ్ బాస్ రియాలిటీ షోకి వెళ్లి వచ్చిన తరువాత బాగా పాపులర్ అయింది. అలాగే సినిమాల్లో కూడా నటిస్తోంది ఇప్పుడు. ఆమెకి సామాజిక మాధ్యమాల్లో చాలామంది ఫాలోవర్స్ వున్నారు. తాజాగా తను పెట్టిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి

Ariyana Glory: అరియనా అందాలు, నెటిజన్స్ కామెంట్స్
Ariyana Glory

నటి, యాంకర్ అయిన అరియనా గ్లోరీ ఈమధ్య సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఆమె తన గ్లామర్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటే, కిందని నెటిజన్స్ ఆమె ఫోటోలకి కామెంట్స్ పెడుతూ వున్నారు. ఆ విధంగా ఆమె సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటోంది.

ariyanaglorya.jpg

అరియనా తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో అడుగుపెట్టాక బాగా పాపులర్ అయింది. అంతవరకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ గా అందరికీ పరిచయం అయిన అరియనా బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఒక్కసారిగా పాపులర్ అయిపొయింది.

ariyanagloryb.jpg

తరువాత ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జిమ్ లో ఇంటర్వ్యూ తో ఇంకా పాపులర్ అయింది. అయితే అప్పట్లో బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టిన అరియనాకి ఇప్పటి అరియనాకి చాలా మార్పు వుంది అని అంటున్నారు నెటిజన్స్.

ariyanagloryc.jpg

ఎందుకంటే అప్పట్లో కొంచెం సన్నగా వున్న అరియనా ఇప్పుడు కొంచెం వెయిట్ పెరిగింది అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే సినిమాల్లోకి ఈమెని తీసుకోండి అని కూడా కామెంట్స్ పెడుతున్నారు. అరియనా కొన్ని సినిమాలు చేసింది, కానీ ఆమెకి తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి.

ariyanagloryd.jpg

ఈమధ్యనే తన డ్రీమ్ హౌస్ కట్టుకుంటున్నటుగా కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అరియనా. కన్స్ట్రక్షన్ అవుతున్న ఇల్లు ఫోటో పెట్టి అది ఇంకా తయారవుతోంది అంటూ తన సిస్టర్ తో వున్న ఫోటో పెట్టింది అరియనా.

Updated Date - Jun 24 , 2024 | 12:57 PM