Pawan Kalyan: మీసం తిప్పడం.. ఛాతీ విరవడం తెలీదు
ABN , Publish Date - Dec 21 , 2024 | 07:59 AM
దయచేసి నన్ను సమస్యలు చేసుకోనివ్వండి. నేను బయటకు వచ్చినప్పుడు నా మీద పడిపోతే నేను పని ఎలా చేయాలి. రోడ్ల పరిస్థితి ఏంటో తెలుసుకుందాం అంటే రోడ్డు కూడా కనిపించకుండా గుమిగూడుతున్నారు. మీరే చెప్పండి. ఇలాగైతే జనాల్లోకి వెళ్లి సమస్యలు ఎలా తెలుసుకోగలను?
ఏపీ డిప్యూటీ సీఎం(APDCM), జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan kalyan) తన అభిమానులకు నవ్వుతూ చురకలు అంటించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఆయన ఓ సభలో మాట్లాడుతూ "అభిమానులు (Pawan Fans) చూపించే ప్రేమ ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం నేను ఉత్తరాంధ్ర Uttarandhra) పర్యటనకు వచ్చా. అభిమానులను కోరేది ఒకటే.. దయచేసి నన్ను సమస్యలు చేసుకోనివ్వండి. నేను బయటకు వచ్చినప్పుడు నా మీద పడిపోతే నేను పని ఎలా చేయాలి. రోడ్ల పరిస్థితి ఏంటో తెలుసుకుందాం అంటే రోడ్డు కూడా కనిపించకుండా గుమిగూడుతున్నారు. మీరే చెప్పండి. ఇలాగైతే జనాల్లోకి వెళ్లి సమస్యలు ఎలా తెలుసుకోగలను? పనులు ఎలా చేయగలను. దయచేసి నన్ను పని చేసుకోనివ్వండి. నేను పని చేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఒకప్పుడు సీఎం.. సీఎం.. అనేవారు డిప్యూటీ సీఎం అయ్యాను కదా! ఓజీ ఓజీ (OG Movie) అంటే పనులు జరగవు. యువత అంతా సినిమాలు, హీరోల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు. జేజేలు కొట్టండి కానీ బాధ్యతలు మరిచిపోవద్దు. మాట్లాడితే మీసం తిప్పు అన్నా.. అంటారు.. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు. ఛాతీ చూపిస్తే పనులు కావు. మన కష్టాలను ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తేనే పనులు జరుగుతాయి. నాకు మీసం తిప్పడం. ఛాతీ విరవడం తెలీదు. పని చేయడం తెలుసు. ఆ పనులు పూర్తి కావడానికి సహకరించండి’’ అని అన్నారు.
ప్రస్తుతం పవన్‌కల్యాణ్ చేతిలో హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు ఉన్నాయి. రాజకీయాలతో బిజీగా ఉన్న ఆయన సమయం కుదిరినప్పుడు వారానికి రెండు రోజులపాటు ఒక్కో సినిమాకు కాల్షీట్లు ఇస్తున్నారు.