Anupama Fans Fire: మిమ్మల్ని ఇంకోలా ఊహించుకున్నాం.. కానీ మీరు అలా లేరు.. అసహ్యం వేస్తోంది!

ABN , Publish Date - Feb 19 , 2024 | 05:13 PM

పాత్ర ఏదైనా పక్కింటి అమ్మాయిలా సాంప్రదాయం గా కనిపించేది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ . తను ఎంచుకునే ఏ పాత్రలోనూ అసభ్యతకు చోటు ఉండేది కాదు. నటన, కళ్లతో హావభావాలు పలికించి తెలుగు ప్రేక్షకులకు అత్యంత దగ్గరైంది. పద్దతైన ఆమె పాత్రలపైనే కాదు, ఆఫ్‌ స్క్రీన్లో కనినిపించే తీరుకి ఆమెపై మనసు పారేసుకున్నారు

Anupama Fans Fire: మిమ్మల్ని ఇంకోలా ఊహించుకున్నాం.. కానీ మీరు అలా లేరు..  అసహ్యం వేస్తోంది!

మేరీ జార్జ్‌ (ప్రేమమ్‌),

నాగవల్లి(అఆ),

నిత్య (శతమానంభవతి),


నందిని (తేజ్‌ ఐ లవ్‌ యూ),


ముగ్ద (కార్తికేయ-2)


కృష్ణవేణి (రాక్షసుడు)


నళిని (ఈగల్‌)

ఇలా పాత్ర ఏదైనా పక్కింటి అమ్మాయిలా సాంప్రదాయం గా కనిపించేది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran) . తను ఎంచుకునే ఏ పాత్రలోనూ అసభ్యతకు చోటు ఉండేది కాదు. నటన, కళ్లతో హావభావాలు పలికించి తెలుగు ప్రేక్షకులకు అత్యంత దగ్గరైంది. పద్దతైన ఆమె పాత్రలపైనే కాదు, ఆఫ్‌ స్క్రీన్లో  కనినిపించే తీరుకి ఆమెపై మనసు పారేసుకున్నారు తెలుగు యువత. అనుపమను ఎంతగానో అభిమానించే వారు ఇప్పుడు ఆమెను అసహ్యించుకుంటున్నారు. కెరీర్‌ బిగినింగ్‌ నుంచి ఆఫ్‌ స్ర్కీన, ఆన సీ్ట్రన సాంప్రదాయంగా కనిపించే ఆమె ఇప్పుడు హద్దులు దాటుతోంది. అందాలు ఆరబోస్తూ హాట్‌ హాట్‌గా కనిపిస్తోంది. ‘రౌడీ బాయ్స్‌’ సినిమాలో లిప్‌ కిస్‌ సీన్స్‌తో రెచ్చిపోయిన అనుపమ.. రీసెంట్‌ గా ‘ టిల్లు స్క్వేర్  ’ సినిమా ట్రైలర్‌లో కూడా లిప్‌ లాక్స్‌తో రెచ్చిపోవడం, స్కిన్  షో చేయడం ఆమెను అభిమానించేవారికి నచ్చడం లేదు. (Fans Fire on Anupama)

Anu-3.jpg

దీంతో సోషల్‌ మీడియాలో ఆమెపై ట్రోలింగ్‌ మొదలైంది. అందాల అనుపమా.. అవకాశాల కోసమేనా ఈ ప్రయత్నాలు.. స్కిన్ షో అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఓ అభిమాని మాత్రం తన బాధను వినూత్నరీతిలో చెప్పారు. అనుపమాను విపరీతంగా అభిమానించే ఓ ఆటో డ్రైవర్‌ ఆమెను తెరపై హాట్‌హాట్‌గా చూడలేక.. 'మీలాంటి హీరోయిన్ కు   ఇది సరికాదు’ అంటూ ఓ వీడియో వదిలాడు.

Anu-1.jpg

‘నేను అభిమానించే అనుపమా గారు.. నా ఆటోలో మీ ఫొటో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా?. ఒకప్పుడు మీరు నటించిన పాత్రలు అలాంటివి. అఆ సినిమాలో మీరు చేసిన పాత్ర ఎలాంటిదో గుర్తుందా మీకు? శతమానం భవతి మిమ్మల్ని చూసి మరదలు అంటే ఇలా అనుకున్నాం. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాలతో మమ్మల్ని అలరించారు. మరి ఇప్పుడు మీరు చేసే సినిమాలు ఎలాంటివి? రౌడీబాయ్స్‌, టిల్లు స్వ్కేర్‌ మీ నుంచి ఇలాంటి సినిమాలు ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. ఒకప్పుడు సావిత్రి గారు, సౌందర్య గారిలానే మీరు కూడా మంచి సినిమాలు చేస్తారనుకున్నాం, కానీ మీరు రూట్‌ మార్చేశారు. ఇప్పుడు మీరు చేస్తున్నది మాత్రం మాకేం నచ్చడం లేదండి. ఓ అభిమానిగా చాలా ఫీలవుతున్నా. దయచేసి మంచి పాత్రలు చేయండి’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు.

Anu-23.jpg

Updated Date - Feb 19 , 2024 | 05:13 PM