Poonam Pandey: చీప్ పబ్లిసిటీ స్టంట్ అంటున్న నెటిజన్స్

ABN , Publish Date - Feb 03 , 2024 | 03:00 PM

వివాదాలతోటే ఎక్కువగా వార్తల్లో వున్న నటి పూనమ్ పాండే చనిపోయినట్టుగా నిన్న అని, ఈరోజు బతికున్నాను అంటూ ఈసారి ఇంకో చీప్ పబ్లిసిటీ చేసింది అని నెటిజన్స్ ఆమె మీద మండిపడుతున్నారు.

Poonam Pandey: చీప్ పబ్లిసిటీ స్టంట్ అంటున్న నెటిజన్స్
Poonam Pandey

వివాదాస్పద నటి పూనమ్ పాండే చనిపోలేదని, బతికే వున్నానని ఈరోజు ఒక ప్రకటనలో చెప్పింది. సర్వైకల్ క్యాన్సర్‌ (గర్భాశయ కాన్సర్) తో పూనమ్ పాండే చనిపోయిందని నిన్న ఒక పోస్ట్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె అంత పెద్ద పేరున్న నటి కాకపోయినా, వివాదాలతో ఎక్కువగా వార్తలో వున్న నటి. ఆమె క్యాన్సర్ తో చనిపోయింది అనే వార్త విని కొంతమంది సెలెబ్రిటీలు ఆమె నిజంగానే చనిపోయిందని తమ సంతాపం తెలియచేసారు. ఈరోజు ఆమె మళ్ళీ నేను బతికున్నాను అంటూ ఇంకో పోస్ట్ పెట్టి, ఇదంతా సర్వైకల్ క్యాన్సర్‌ మీద ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి అని చెప్పింది ఆమె.

ఆమె చేసిన పనికి నెటిజన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇదంతా ఒక చీప్ పబ్లిసిటీ అని నెటిజన్స్ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. సర్వైకల్ క్యాన్సర్‌ మీద అవగాహన పెంచడం మంచిదే కానీ, ఇలా చీప్ పబ్లిసిటీ తో మాత్రం కాదు అని అంటున్నారు. పూనమ్ పాండే జీవితంలో ఇది కూడా ఇంకో వివాదంగా మిగిలిపోనుంది అని అంటున్నారు. ఆమెకి ఇప్పుడు సినిమా ఛాన్సులు లేవు, పేరు కూడా రావటం లేదు, అందుకని మళ్ళీ వైరల్ కావటానికి ఇదొక్కటే మార్గం అని ఈ సర్వైకల్ క్యాన్సర్‌ ని ఎంచుకొని చనిపోయినట్టుగా నాటకం ఆడింది అని అంటున్నారు.

poonampandey.jpg

2011లో భారతదేశం ప్రపంచ క్రికెట్ కప్ ని గెలిస్తే తాను నగ్నంగా స్టేడియంలో తిరుగుతానని ప్రకటించింది. భారతదేశం కప్ గెలిచింది, పూనమ్ తాను అన్న మాటని నిజం చెయ్యడానికి ప్రయత్నం చేస్తే అప్పట్లో బీసీసీఐ తో సహా చాలా సంస్థలు అడ్డుపడ్డాయి. అప్పుడు ఆమె వార్తల్లో వుంది వివాదంగా మారింది. ఆ మరుసటి సంవత్సరం ఐపీల్ జట్టు కొలకత్తా నైట్ రైడర్స్ జట్టు ఐపీల్ ట్రోఫీని గెలుచుకుంటే, అప్పుడు పూనమ్ పాండే సామజిక మాధ్యమంలో నగ్నంగా వున్న ఫోటో పెట్టి మళ్ళీ వివాదంలోకి ఎక్కింది.

తన వైవాహిక జీవితం గురించి కూడా వివాదం రేపింది. తాను డేటింగ్ చేసిన అబ్బాయినే పెళ్లిచేసుకుంది, పెళ్ళైన కొన్నిరోజులకే అతనిమీద గృహ హింస నేరం పెట్టింది, మళ్ళీ అతనితో కలిసిపోయింది. తన పేరు మీద ఒక యాప్ ని విడుదల చేసింది, మళ్ళీ ఆ యాప్ ని డిలీట్ చేసింది. ఇలా ఎప్పుడూ వివాదంలో వుండే పూనమ్ పాండే ఈసారి ఈ సర్వైకల్ క్యాన్సర్‌ పేరుమీద చనిపోయినట్టుగా నిన్న అంటూ, లేదు బతికే వున్నాను అని ఈరోజు అంటూ ఇంకో వివాదం సృష్టించింది. ఇప్పటివరకు ఈమె జీవితం అంతా ఇలా వివాదాలతో సాగుతూ ఉండటం ఆశ్చర్యకరమైన అంశం.

Updated Date - Feb 03 , 2024 | 03:00 PM