Anjali: బాలయ్య నన్ను ఎందుకు నెట్టారో నాకు తెలుసు.. అనవసరంగా పెద్దది చేశారు
ABN , Publish Date - Jun 02 , 2024 | 11:25 AM
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఒక చిన్న సంఘటనపై అనవసర రాద్ధాంతం చేశారు. ఆ స్టేజీ మీద ఏం జరిగిందనే విషయం మాకు తెలుసు.. దానిపై అంత అతి చేయాల్సిన అవసరం లేదని అన్నారు తెలుగు నటి అంజలి. తాజాగా ఆమె నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం విడుదలై.. సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా అంజలి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఒక చిన్న సంఘటనపై అనవసర రాద్ధాంతం చేశారు. ఆ స్టేజీ మీద ఏం జరిగిందనే విషయం మాకు తెలుసు.. దానిపై అంత అతి చేయాల్సిన అవసరం లేదని అన్నారు తెలుగు నటి అంజలి (Actress Anjali). తాజాగా ఆమె నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం విడుదలై.. సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా అంజలి సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా ఆంధ్రజ్యోతికి తెలియజేశారు. సోషల్ మీడియా గురించి, రీసెంట్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుక (Gangs Of Godavari Pre Release Event)లో జరిగిన సంఘటన గురించి అంజలి మాట్లాడుతూ..
Also Read: Super Star Krishna Brother: ఈ ఫొటోలో ఉన్నది కృష్ణ కాదంటే ఎవరైనా నమ్మగలరా?
‘‘నేను సోషల్ మీడియా (Social Media) ఫాలో అవుతాను. అయితే దీన్ని ఒక సాధనంగా మాత్రమే చూస్తాను. నా ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పటానికి మాత్రమే వాడతాను. ఏదో ఒక విషయం చెప్పి.. దానిపై వివాదం వస్తే... దాన్ని విశ్లేషించడం, మళ్లీ వివరణ ఇవ్వడం.. ఇలా ఉపయోగించను. నా ఉద్దేశంలో కరెక్ట్‌గా వాడే వారికి మంచిదే. అదే జీవితమనుకొని.. నెగిటివిటీని వ్యాపింపచేయటం మాత్రం సరైనది కాదు. చాలా సందర్భాలలో మొత్తం స్టోరీ చెబితే తప్ప- అసలు విషయం మనకు అర్థం కాదు.
అనవసరంగా పెద్దది చేశారు...
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఒక చిన్న సంఘటనపై అనవసర రాద్ధాంతం చేశారు. ఆ స్టేజీ మీద ఏం జరిగిందనే విషయం మాకు తెలుసు. బాలయ్య (Natasimham Balakrishna) నన్ను కొద్దిగా జరగమని నెట్టారు. నేను వెంటనే నవ్వేశాను. దాన్ని సోషల్ మీడియాలో అనవసరంగా పెద్దది చేశారు. బాలయ్య నాకు ‘డిక్టేటర్’ (Dictator) సినిమా నుంచి తెలుసు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కూడా ఆయన.. ‘నాకూ, అంజలికి ఎనర్జీ మ్యాచ్ అవుతుంది. మా భావాలు మొహంలో తెలిసిపోతాయు’ అన్నారు కూడా! ఇది చాలా చిన్న సంఘటన. సోషల్ మీడియాలో అనవసరపు సంఘటనలు ఎలా వైరల్ అవుతాయో చెప్పటానికి ఇదొక ఉదాహరణ..’’ అని చెప్పుకొచ్చారు.
Read Latest Cinema News