Amala Akkineni: సిగ్గుగా లేదా.. కొండా సురేఖపై అమల అక్కినేని ఫైర్
ABN , Publish Date - Oct 02 , 2024 | 10:42 PM
తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. తన కుటుంబ సభ్యులపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై నటి అమల అక్కినేని ఘాటుగా స్పందించారు. సిగ్గుగా అనిపించడం లేదా అంటూ అమల అక్కినేని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రాహుల్ గాంధీకి కూడా ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ అమల అక్కినేని ఏమన్నారంటే..
తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. తన కుటుంబ సభ్యులపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై నటి అమల అక్కినేని ఘాటుగా స్పందించారు. సిగ్గుగా అనిపించడం లేదా అంటూ కొండా సురేఖకు కౌంటర్ ఇస్తూనే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. ప్రస్తుతం అమల అక్కినేని ట్వీట్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఆమెకు నెటిజన్లు లైకులు, రీ పోస్ట్‌లతో సపోర్ట్ అందిస్తున్నారు. ఇంతకీ అమల అక్కినేని ఏమని ట్వీట్ చేశారంటే..
Also Read- Samantha: కొండా సురేఖ కాంట్రవర్సీ వ్యాఖ్యలపై సమంత స్ట్రాంగ్ కౌంటర్
‘‘ఒక మహిళా మంత్రి రాక్షసంగా మారడం.. చెడుగా కల్పిత ఆరోపణలను చేయడం, వారి రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలోని పౌరులను వాడుకోవడం నాకు దిగ్భ్రాంతిని కలిగించింది. మంత్రి గారు.. మీకు సిగ్గుగా లేదా.. ఎలాంటి వాస్తవాలు లేకుండా నా భర్త గురించి పూర్తిగా అసత్య కథనాలను ప్రచారం చేయడం నిజంగా సిగ్గుచేటు. నాయకులు నేరస్తులలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది? మిస్టర్ రాహుల్ గాంధీజీ.. మీరు వ్యక్తుల గౌరవమర్యాదలను విశ్వసిస్తే, దయచేసి మీ రాజకీయ నాయకులను అదుపులో ఉంచుకోండి. మరియు మీ మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పి ఆమె విషపూరిత వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా తక్షణమే చర్యలు తీసుకోండి. ఈ దేశ పౌరులను రక్షించండి..’’ అంటూ అమల అక్కినేని ఘాటుగా స్పందించారు.
Also Read- Konda Surekha: చైతూ-సమంత విడాకులు, రకుల్ హడావుడి పెళ్లి.. కారణం కేటీఆరే..
అసలేం జరిగిందంటే..
ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాకలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖకు మెదక్ ఎంపీ రఘునందనరావు చేనేత కార్మికుల సమస్యలను విన్నవిస్తూ నూలుపోగు దండను మంత్రి మెడలో వేశారు. దీనిపై కొందరు ట్రోల్స్ చేయడంతో పాటు అసభ్యకరంగా పోస్టులు చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేసిన వ్యక్తుల డీపీలో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఫోటో ఉండటంతో వాళ్లు బీఆర్‌ఎస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ అనుమానిస్తోంది. బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతోనే ఈ పోస్టులు చేశారని, దీని వెనుక కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలపై బుధవారం కొండా సురేఖ మీడియా ముందుకు వచ్చి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తెలుగు సినిమా ఇండస్ట్రీలోని వారు కూడా ఖండిస్తున్నారు. సమంత కూడా కొండా సురేఖకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.