Pushpa 2: అల్లు అర్జున్ గెడ్డం ట్రిమ్మింగ్, పోస్టుపోన్ అయిన షూటింగ్

ABN , Publish Date - Jul 13 , 2024 | 04:02 PM

'పుష్ప 2' సినిమా ఇంకా వార్తల్లో వుంది. ఆగస్టు 15న సినిమా విడుదల కావాల్సి ఉండగా, విడుదల తేదీని డిసెంబర్ కి వాయిదా వేశారు. పోనీ చిత్రీకరణ అయినా జరుపుకుంటుందా అంటే, అది కూడా వాయిదా వేసేశారు అని తెలిసింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ గెడ్డం ట్రిమ్మింగ్ చేసుకున్నాడని, అందుకని షూటింగ్ కూడా వాయిదా పడిందని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.

Pushpa 2

అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' సినిమాకి ఇంకా కష్టాలు తొలగిపోలేదు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టి సుమారు రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఇంకా పూర్తి కాలేదు. 'పుష్ప' సినిమాకి సీక్వల్ గా వస్తున్న 'పుష్ప 2' డిసెంబర్ లో విడుదలవుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవ్వాల్సి వుంది, కానీ చిత్రీకరణ ఇంకా చాల జరపాల్సి ఉండటంతో విడుదల వాయిదా పడింది. (Allu Arjun trimmed his beard, thus Pushpa 2 shooting postponed, says a source)

ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మిత్రుడు కోసం నంద్యాల వెళ్లి ప్రచారం చేసిన దగ్గర నుంచి అల్లు అర్జున్ పై కొంచెం నెగటివిటీ మొదలైంది. ఆ తరువాత మెగా కుటుంబం అతన్ని దూరంగా పెట్టింది. పవన్ కళ్యాణ్, మెగా స్టార్ చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు కానీ, అల్లు కుటుంబ సభ్యులు ఒక్కరూ కనపడలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి అల్లు అర్జున్ ని ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. (Allu Arjun and Sukumar combination Pushpa 2 shooting getting postponed because of this)

alluarjunsukumar.jpg

ఈ నేపథ్యంలో అతని 'పుష్ప 2' ఆగస్టు 15న విడుదలవ్వాల్సి వుంది, కానీ అనూహ్యంగా ఆ సినిమా డిసెంబర్ కి వాయిదా పడింది. అంతే ఇంకేముంది అంతవరకు చాలా జోరుగా చిత్రీకరణ జరుపుతూ వున్న యూనిట్ సభ్యులు, వాయిదా పడటంతో చిత్రీకరణ కూడా నెమ్మదిగా చెయ్యాలని అనుకున్నారు, తరువాత కాన్సిల్ కూడా అయింది. ఇలా ఈ సినిమాకి ఇప్పుడు సినిమా కష్టాలు మొదలయ్యాయి. (Allu Arjun starrer Pushpa 2 shooting and release date update)

తాజాగా తెలిసిన వార్త ఏంటంటే అల్లు అర్జున్ తన గెడ్డం ట్రిమ్మింగ్ చేసుకున్నాడు అని అంటున్నారు. ఈ సినిమాలో పుష్ప పాత్ర వేస్తున్న అల్లు అర్జున్ కి గెడ్డం చాలా ఒత్తుగా ఉండాలి, అందుకని అతని గడచిన కొన్ని సంవత్సరాల నుండి ఒత్తుగా గెడ్డం బాగా పెంచుకొని చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఎప్పుడైతే ఈ సినిమా నిరవధికంగా వాయిదా పడిందో అతను కూడా ఎంతకాలం ఈ గెడ్డం అని ట్రిమ్మింగ్ చేసుకున్నట్టుగా భోగట్టా.

FahadhFaasilPushpa2.jpg

ఇప్పుడు ట్రిమ్మింగ్ చేసుకున్న గెడ్డంతో అల్లు అర్జున్ షూటింగ్ నడవదు, అందుకని మళ్ళీ అతను ఒత్తుగా గెడ్డం పెంచేవరకు ఆగాలి. ఈ లెక్కన ఈ సినిమా డిసెంబర్ కైనా విడుదల అవుతుందా, లేదా వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్ కి పోస్టుపోన్ అవుతుందా అని ఒక చర్చ పరిశ్రమలో నడుస్తోంది. రష్మిక మందన్న ఇందులో కథానాయకురాలు, ఆమె ఇప్పుడు వరస సినిమాలతో చాలా బిజీగా వుంది. అలాగే ఈ సినిమాలో చాలామంది నటీనటులు వున్నారు, అందరి కాంబినేషన్ దొరకటం కూడా కొంచెం కష్టమే అంటున్నారు. మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్ ఇందులో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

Updated Date - Jul 13 , 2024 | 04:02 PM