Konidela vs Allu family: డేమేజ్ జరిగింది, మరి పూడ్చటం అల్లు అరవింద్ వంతు కదా!

ABN , Publish Date - Jul 23 , 2024 | 06:24 PM

మొన్న బన్నీవాసు, ఈరోజు హైపర్ ఆది, రేపు ఇంకొకరు, ఎల్లుండి ఇంకొకరు ఇలా ఒక్కొక్కరు అల్లు, కొణిదెల కుటుంబాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పుకొస్తూ వుంటారు. అల్లు అర్జున్ చేసిన డేమేజ్ చిన్న విషయం కాదు అని మెగా ఫామిలీ అనుకుంటున్నారని ఒక టాక్. అందుకే ఇప్పుడు అల్లు అరవింద్ రంగంలోకి దిగి ఆ డేమేజ్ ని పూడ్చడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వీరందరూ ఈ రెండు కుటుంబాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పడం అని ఒక టాక్ నడుస్తోంది.

Chiranjeevi and Allu Aravind

అల్లు అర్జున్ రీసెంట్ గా జరిగిన ఎన్నికల ముందు నంద్యాల వెళ్లి తన స్నేహితుడి కోసం ప్రచారం చేసిన రోజు నుండీ ఇటు అల్లు, అటు కొణిదెల కుటుంబాల మధ్య కొంచెం వ్యత్యాసం పెరిగిన మాట వాస్తవం అని అందరూ ఒప్పుకుంటున్నారు. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అని, మళ్ళీ కలుసుకుంటారు అని ఈమధ్య బన్నీ వాసు చెప్పారు. అంటే రెండు కుటుంబాల మధ్య కొంచెం అంతరాలు ఉన్నాయని అయన పరోక్షంగా ఒప్పుకున్నారు అని కూడా పరిశ్రమలో చర్చ నడిచింది. (Allu Aravind is now trying to do the damage control)

అయితే ఇప్పుడు ఆ అంతరాన్ని మళ్ళీ దగ్గర చెయ్యడానికి అల్లు అరవింద్ నడుం కట్టారు అని తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వరకు ఈ అంశం గురించి ఎవరూ మాట్లాడలేదు కానీ ఇప్పుడు మళ్ళీ అందరిచేత ఈ రెండు కుటుంబాల మధ్య ఎటువంటి అంతరాలు లేవని అందరిచేత చెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. (Bunny Vasu, Hyper Adhi all are sayign that there are no differences between Konidela and Allu Family)

బన్నీవాసు మెగా కుటుంబం అంతా ఒకటే అని వాళ్ళమధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. ఈరోజు హైపర్ ఆది కూడా ఇదే విషయాన్ని వల్లెవేశాడు. అల్లు అర్జున్ ని ట్రోల్ చేయొద్దు అని, పవన్ కళ్యాణ్ కి అతనికి మధ్య ఎటువంటి విభేదాలు లేవని, అందరూ ఒకటే అని చెప్పుకొచ్చాడు. వీళ్ళ కన్నా ముందు కిర్రాక్ ఆర్పీ కూడా అల్లు అర్జున్, మెగా ఫామిలీ ఒకటే అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. (Will Allu Arjun say sorry to Mega Star Chiranjeevi?)

alluaravindarjuna.jpg

ఇలా ఇందరిచేత చెప్పించే బదులు అల్లు అర్జున్ నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి ఒక ఫోటో తీసి పెట్టొచ్చు కదా, మా కుటుంబాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పొచ్చు కదా నేరుగా అని పరిశ్రమలో ఒక చర్చ నడుస్తోంది. అయితే అల్లు అర్జున్ చేసిన పనికి మెగా కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది అనేది సత్యం. ఎందుకంటే మెగా స్టార్ చిరంజీవి లాంటి వ్యక్తే అల్లు అర్జున్ ని నంద్యాల వెళ్లొద్దు అని చెప్పినప్పుడు, అతని మాట వినిపించుకోకుండా అల్లు అర్జున్ వెళ్ళాడు అనేది అందరి నోటా వినిపిస్తున్న మాట.

మరి అంతలా మెగా స్టార్ చెప్పినప్పుడు అల్లు అర్జున్ వినిపించుకోకుండా వెళ్లడం తప్పే కదా! ఇంత చేసాక అల్లు అర్జున్ కి ఇప్పుడు మెగాస్టార్ తో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడే ధైర్యం ఉందా. తప్పు అయిందని ఒప్పుకుంటాడా? దానికితోడు అదే రోజు రామ్ చరణ్, తన అమ్మగారు సురేఖతో పవన్ కళ్యాణ్ ని కలవటానికి రాజముండ్రి వెళ్లారు, అది కూడా ఒక కారణం అయింది. ఆరోజు వార్తల్లో తనే ఉండటానికి తన స్నేహితుడు పిలవకపోయినా నేనే వచ్చాను అని నంద్యాలలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన అల్లు అర్జున్, రామ్ చరణ్ ని ఓవర్ షాడో చేద్దామనే కదా అదే రోజు నంద్యాల వెళ్ళింది అని మెగా కుటుంబం అనుకుంటున్నట్టుగా అనుకుంటున్నారు. (Allu Aravind, Mega Family, Allu Arjun)

ఈమధ్య అల్లు అర్జున్ తన దగ్గరి సహచరులతో తనే మెగా స్టార్ కి రీప్లేస్ అనే మాట కూడా అంటున్నట్టు పరిశ్రమలో ఒక చిన్న టాక్ బయలుదేరింది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావటం, రెండు సినిమాలు వరసగా హిట్ కావటం, 'పుష్ప 2' కి కొంచెం క్రేజ్ రావటంతో అల్లు అర్జున్ కి కొంచెం ప్రౌడ్ నెస్ బాగా పెరిగిపోయింది అని కూడా ఒక టాక్ నడుస్తోంది. అందువలనే వద్దని చెప్పినా నంద్యాల వెళ్లడం జరిగిందని, అయితే అల్లు అర్జున్ ఆశించిన ఫలితం అక్కడ రాకపోవటంతో కొంచెం డౌన్ అయినట్టుగా కనపడుతోంది.

ఆగస్టు 15వ తేదీన విడుదల కావలసిన 'పుష్ప 2' డిసెంబర్ నెలకి వాయిదా పడింది. అప్పుడైనా సజావుగా విడుదలవుతుందా అనే ప్రశ్న పరిశ్రమలో చర్చగా మారింది. సుకుమార్, అల్లు అర్జున్, నిర్మాతలు మా మధ్య విభేదాలు లేవని బయటకి చెపుతున్నా, నిర్మాతలకైతే మాత్రం ఇలా వాయిదా పడటం వలన కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతోంది అనేది పరిశ్రమలో ఎవరిని అడిగినా చెప్తారని తెలుసు. మరి ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు, ఎలా పూడుస్తారు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇన్ని విషయాల నేపథ్యంలో కొడుకు చేసిన పనికి, తండ్రి అల్లు అరవింద్ రంగంలోకి దిగి మళ్ళీ ఈ రెండు కుటుంబాలని కలిసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలా హైపర్ ఆది, బన్నీ వాసు లాంటివాళ్లతో రెండు కుటుంబాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలా గీత ఆర్ట్స్ సంస్థ నుండి వచ్చే దర్శక, నిర్మాతలు చాలామంది ఇటువంటి మాటలే చెప్పవచ్చని కూడా అంటున్నారు.

ఏమైనా ఒక మనిషికి విజయం కానీ, అపజయం కానీ బాగా వంట పట్టించుకుంటే ఎదుటివాళ్ళు చెప్పే మాటలు వినపడవు అని ఒక సామెత వుంది. విజయం వచ్చినప్పుడే ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి, వ్యవహరించాలి. చిన్న సమస్యని పెద్దదిగా చేసుకొని, ఇప్పుడు ఆ సమస్యని ఎలా పరిష్కరించాలని అనుకుంటున్నారు!

Updated Date - Jul 23 , 2024 | 06:32 PM