Kushitha Kallapu: లేలేత ప‌రువాల‌తో.. క‌వ్విస్తోన్న‌ ‘బ‌జ్జీల‌’ పాప

ABN , Publish Date - Jun 18 , 2024 | 07:58 PM

పేమ‌స్ యూ ట్యూబ‌ర్‌, న‌టి కుషిత క‌ల్ల‌పు లేలేత ప‌రువాల‌తో ఉరుకులు పెట్టిస్తోంది. చీర‌క‌ట్టులో వ‌య్య‌రాల ఒల‌క‌బోస్తూ రోజుకో వీడియోతో కుర్రకారు గుండెలను పిండేస్తుంది.

Kushitha Kallapu: లేలేత ప‌రువాల‌తో.. క‌వ్విస్తోన్న‌ ‘బ‌జ్జీల‌’ పాప
Kushitha Kallapu

ఈ మ‌ధ్య త‌రుచూ సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తూ బాగా హాడావుడి చేస్తోంది తెలుగు సోయ‌గం కుషిత క‌ల్ల‌పు (Kushitha Kallapu). చీర‌క‌ట్టులో మ‌న ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించే ఈ ప‌క్కా హైద‌రాబాదీ బ్యూటీ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అందులో ఒదిగిపోయి త‌న అందంతో ఎదుటి వారిని మెస్మ‌రైజ్ చేస్తుంది.

Kushitha Kallapu

ఎక్కువ‌గా చీర‌లోనే క‌నిపించే ఈ అచ్చ తెలుగు అందం అందులోనే ర‌క‌ర‌కాలుగా హోయ‌లు పోతూ మ‌గ పుంగ‌వుల మ‌తులు పొగొట్ట‌డంలో పేరు తెచ్చుకుంది. పైగా కేవ‌లం శారీలోనే కాదు మోడ్ర‌న్‌ డ్రెస్సుల‌లోనూ నేనేం త‌క్కువ కాదు అన్న‌చందాన అప్పుడ‌ప్పుడు త‌న మార్క్ డ్రెస్సింగ్‌తో క‌వ్విస్తూ ఉంటుంది.

Kushitha Kallapu

అయితే.. అప్ప‌టివ‌ర‌కు మోడ‌ల్‌గా అంతంత మాత్రంగానే పేరున్న‌ కుషిత (Kushitha Kallapu)కు ఏ ముహుర్తానా హైద‌రాబాద్ డ్ర‌గ్స్ కేసులో ఆమె పేరు బ‌య‌ట‌కు వ‌చ్చిందో కానీ అదే ఆమె పాలిట క‌ల్ప‌వృక్షంగా మారి బాగా పాపుల‌ర్‌ను చేసింది.

Kushitha Kallapu

ముఖ్యంగా కేసు విష‌యంలో నేను డ్ర‌గ్స్ తీసుకోలేదు.. చీజ్ బ‌జ్జీలు తిన‌డం కోస‌మే ప‌బ్‌కు వెళ్లానంటు చెప్పిన‌ మాట‌ల‌తో ఒక్క‌సారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ మార‌డ‌మే కాక‌, ట్రోల‌ర్స్ చేతిలో ఓ రేంజ్‌లో రోస్ట్ అయింది. ఇక ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియా స్టార్‌గా మారిపోయింది.


ఈ క్ర‌మంలో అదే సమయంలో ఈ భామ‌ త‌న‌కు వ‌చ్చిన ఫేమ్‌ను చే జార్చుకోకుండా త‌న పేరు, వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో రెగ్యుల‌ర్‌గా ఉండేలా, క‌నిపించేలా చూసుకుంటుంది. అంతేకాదు అదే ఊపులో రెండు మూడు సినిమాల్లో క‌థానాయిక‌గా కూడా చేసింది. గ‌త సంవ‌త్స‌రం ఛాంగురే బంగారు రాజా, నీతేనే నేను సినిమాల్లో న‌టించిన ఈ చిన్న‌ది ఈ సంవ‌త్స‌రం బాబు నెంబ‌ర్‌వ‌న్ బుల్షిట్ గాయ్ చిత్రంలో న‌టించింది. ప్ర‌స్తుతం మ‌నోహ‌రం అనే మూవీలో క‌థానాయిక‌గా చేస్తోంది.

Kushitha Kallapu

ప్ర‌స్తుతం చేతిలో సినిమాలు అంతంత‌మాత్రంగానే ఉండ‌డంతో కుషిత (Kushitha Kallapu) సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటు అన్ని ఫ్లాట్ ఫాంల‌తో క‌లిపి మిలియ‌న్ వ‌ర‌కు ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకుంది. దీంతో స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా రోజుకో స్టైల్‌లో త‌న అంద‌చందాల‌తో హోయ‌లు ఒలికిస్తూ నిత్యం వీడియోల‌తో నెట్టింట హల్‌చ‌ల్ చేస్తోంది. రోజుకు క‌నీసం ఒక‌టి , రెండు వీడియోల‌ను, ఫోటోల‌ను ఇన్ స్టా, ఎక్స్‌ల‌లో పోస్టు చేస్తూ త‌న ఫాలోవ‌ర్స్‌ను, అభిమానుల‌ను అల‌రిస్తోంది. చూడాలి మున్ముందైనా ఈ అమ్మ‌డికి సినిమా అవ‌కాశాలు పెరుగుతాయో లేదో.

Updated Date - Jun 18 , 2024 | 08:35 PM