Prasad Behara: ఫేమ్ వచ్చింది.. కెరీర్ పోయింది
ABN , Publish Date - Dec 18 , 2024 | 05:29 PM
మంచి హిట్లు సాధించి కెరీర్ మలుపు తిరుగుతున్న దశలో ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహరా నీచానికి దిగజారుడు.
ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహ్ర అరెస్టయ్యారు. వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ఓ యువతిని లైంగిక వేధింపులకు గురి చేయడం తో పాటు, పలు మార్లు అసభ్య పదజాలంతో దూషించినట్లు యువతి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా షూటింగ్ సమయంలో యువతి ప్రైవేట్ భాగాలను తాకుతూ ప్రసాద్ బెహరా నీచంగా ప్రవర్తించాడని పేర్కొంది. దీంతో ప్రసాద్ బెహరా వేధింపులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసును నమోదు చేశారు. ఆయనపై 75(2),79,351(2)BNS సెక్షన్స్ కింద కేసు నమోదు అయ్యింది.
మా విడాకులు,పెళ్లి వారమండి, మెకానిక్ వంటి యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో మంచి పేరు సాధించుకున్న ప్రసాద్ బెహరా కెరీర్ ని ఇటీవల రిలీజైన 'కమిటీ కుర్రాళ్ళు' మలుపు తిప్పింది. తర్వాత వరుస ఆఫర్స్ రావడంతో ఆయన దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ షూటింగ్ లో భాగంగా ఓ నటితో నీచంగా ప్రవర్తించాడు. నీ బ్యాక్ బాగుంది అంటూ యువతితో అసభ్యంగా మాట్లాడాడు. అంతటితో ఆగకుండా అందరి ముందు అసభ్య మాట్లాడాడు. సదరు నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్‌ని రిమాండ్‌కి తరలించారు.