IFFI 2024: ఇండియన్ పనోరమా ఫిలింఫెస్టివల్: ఉత్తరాదికి అందలం.. దక్షిణాదికి మంగళం
ABN , Publish Date - Sep 27 , 2024 | 12:08 PM
ఇప్పటికే ఫిలింఫేర్, సైమా వటి అవార్డుల కార్యక్రమం ముగియగా తాజాగా ఇండియా వేదికగా ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డులకు సమయం ఆసన్నమైంది.
ఇప్పటికే ఫిలింఫేర్, సైమా వటి అవార్డుల కార్యక్రమం ముగియగా తాజాగా ఇండియా వేదికగా ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ (55వ ఇండియన్ పనోరమా) (Indian Panorama 2024) అవార్డులకు సమయం ఆసన్నమైంది. గోవా శాశ్వత కేంద్రంగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఫెస్టివల్‌కు ప్రపంచ వ్యాప్తంగా దేశాల నుంచి ఎంట్రీలను ఆహ్వనించారు. ఈ సంవత్సరం నవంబర్ 20 నుంచి 28 వరకు ఈ వేడక జరుగనుంది. ఉత్తమ చిత్రానికి ప్రధాన బహుమతిగా గోల్డెన్ పికాక్, నటీనటులకు, దర్శకులకు సిల్వర్ పికాక్, చిరకాలం సినిమాలకు సేవలందించిన కేటగిరిలో స్పెషల్ అవార్డు అంటూ మూడు రకాలుగా ఈ అవార్డులను అందజేయనున్నారు.
ఓ జ్యూరీ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో ఫ్యానల్‌కు ముగ్గురు చొప్పున మొత్తంగా నాలుగు ఫ్యానల్లు ఇక్కడ ప్రదర్శణకు వచ్చిన చిత్రాలను వీక్షించి అందులో ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ నటులు, టెక్నీషియన్లను సెలక్ట్ చేసి వారికి ఈ అవార్డులు ప్రధానం చేయనున్నారు. అయితే గతంలో ఈ ఫ్యానల్‌లో తెలుగు నుంచి గానీ సౌత్ రాష్ట్రాల నుంచి ఎవరైనా ఒకరిద్దరి ప్రాతినిధ్యం ఉండేది. కానీ ఈ సారి ఏర్పాటు చేసిన ఫ్యానల్‌లో ఒక్కరంటే ఒక్కరిని కూడా సౌత్ నుంచి ఎంపిక చేయక పోవడంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.
ఇదిలాఉండగా ఈ ఇండియన్ పనోరమా ఫిలింఫెస్టివల్‌కు మన తెలుగు నుంచి కల్కి, భగవంత్ కేసరి, హనుమాన్, రాజు యాదవ్, టైగర్ నాగేశ్వరరావు వంటి తెలుగు సినిమాలు వెళ్లడం విశేషం. వీటితో పాటు మంగఠవారం, ఖుషి, మిస్ షెట్టి మిస్టర్ పొలిషెట్టి, రజాకర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సర్కారు వారి పాట, వందే భారత్, షరతులు వర్తిస్తాయి, విధి,గామి, సౌండ్ విత్ సైలెన్స్, రికార్డ్ బ్రేక్, రక్షణ, పొట్టేల్ వంటి సినిమాలు కూడా ఈ ఫిలిం ఫెస్టివల్‌కు పంపించిన జాబితాలో ఉన్నాయి.