Allu Arjun: అల్లు అర్జున్ ఒక బ్రాండ్.. నిజమా? అబద్దమా?
ABN , Publish Date - Dec 07 , 2024 | 02:28 PM
అల్లు అర్జున్ అనే వ్యక్తి స్టారా? లేదా బ్రాండా? అల్లు అర్జున్ అంటే ఏంటి.. హేతుబద్దమైన విశ్లేషణతో
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసిన 'అల్లు అర్జున్', 'పుష్ప 2' అనే టాపిక్‌లపై మాట్లాడుకుంటున్నారు. అది చెడుగాన, మంచిగాన అనేది రెండవ విషయం. దీంతో ఇంతకీ అల్లు అర్జున్ ఏం సాధించాడు. 'పుష్ప' సినిమాలో చూపించిన విధంగా ఒక ఇంటిపేరును దూరం చేసుకొని సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నట్లేనా? అవుననే అంటున్నారు చాలామంది. గమనిక ఇది సినిమా రిజల్ట్ గురించి కాదు.
దాదాపు దశాబ్దం నుండి రిలీజైన ఏ అల్లు అర్జున్ మూవీకైనా మొదట నెగిటివ్ టాక్ వస్తుంది. చివరకు సినిమా మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది. ఎందుకు ఇలా అనే ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషిస్తే.. ఒకటి సినిమాతోనైనా ప్రాబ్లమై ఉండాలి లేదా అల్లు అర్జున్ తోనైన ఉండాలి. ఇంకా డీప్‌గా వెళ్తే బయటికొచ్చే అంశం ఏంటంటే.. ఎవరికీ తెలియకుండానే సైలెంట్ గా అల్లు అర్జున్ ఒక బ్రాండ్ గా ఎదిగారు. ఈ విషయాన్నీ ఏ సినీ పెద్ద చెప్పకపోవడంతో సగటు తెలుగు సినిమా అభిమానులకు అర్థం కావడం లేదు. తమ హీరోలకంటే పెద్ద బ్రాండ్ అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. నిజానికి ఆ డైజేషన్ ప్రాబ్లమ్ రావాల్సింది ఇతర హీరోలకేమో కానీ.. అభిమానులు మధ్యలో దూరి ఫుడ్ పాయిజన్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ అనేది ఒక బ్రాండ్ అవునా? కాదా? అనేది తెలియాలంటే.. మంచిగా ఎకనామిక్స్, కామర్స్, సోషియాలజీ చదివిన విద్యావంతులని అడిగి ఎనాలసిస్ చేయమనండి. తర్వాత వాస్తవాన్ని మాత్రమే అంగీకరించండి.
దుష్ప్రచారం, రివ్యూలు
'పుష్ప 2' సినిమాలో తన డైలాగులతో బాస్ ని టార్గెట్ చేశాడు అంటూ కొన్ని ఫేక్ డైలాగులను ప్రచారం చేశారు. దీని వెనుక ఎవరు ఉన్నారనేది తెలుసుకోవడం కష్టమేమో కానీ.. ప్రచారం చేసుకున్నది మాత్రం మూడు రాజకీయ పార్టీలు. సినిమాలకి, రాజకీయాలకి సంబంధం ఏంటి. ఈ కనీస హేతుబద్దత లేకుండా మనుషులు తయారవడానికి కారణం ఎవరు. పోనీ.. ఏ సినీ నటుడైన హేతు బద్దతను పెంపొందించటానికి కృషి చేస్తున్నారా? లేదు కదా! అయితే ఏ హీరోకి ఫ్యాన్స్ ఉండాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా మహామహులు జనాల రక్తల్లోకి ఎక్కించిన పైత్యంతో వారు ఎప్పుడో బానిసలుగా మారిపోయారు. కొన్ని జెనరేషన్లు కూడా తేరుకొని పరిస్థితిని విజయవంతంగా సృష్టించారు. ఈ పైత్యమే సినిమా చూడని వాళ్ళతో నెగిటివ్ రివ్యూలు ఇప్పిస్తుంది.
అహంకారం
ఇదంతా కాదు.. ఆ హీరోకి అహంకారం, ఆయన బిహేవియర్ ప్రాబ్లమ్ తోనే అనుకుంటే వెళ్లి స్టార్‌డమ్ డెఫినేషన్ చదువుకోండి. మరి మా హీరో కాదా స్టార్.. బాగానే బిహేవ్ చేస్తాడు అంటారా. మీ మెదడులో మా హీరో అనే ప్రసక్తి వచ్చిన ప్రతిసారి మీలో సినీ ఇండస్ట్రీ ఎక్కించిన పైత్యమే మాట్లాడిస్తుందని గుర్తించండి. స్టార్‌డమ్ అనే దానికి సింప్లిసిటీతో అసలు సంబంధం లేదు. వాళ్లనే స్టార్స్ అంటారు. ఇది వెస్ట్ కల్చర్ లో పుట్టిన పదం. స్టార్‌డమ్ తో డబ్బు సంపాదిస్తారు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకుంటారు. (There is no black, no white, everything is grey)
బీహార్ & కల్చర్
మరికొందరు ఈ సినిమా గుట్కా, బీహార్ బ్యాచ్ కోసం రూపొందించారు అంటూ అవహేళనలు చేస్తున్నారు. మొదటగా కల్చర్ తెలుసుకోని మాట్లాడితే బాగుండేది. బీహార్ అంటే కేవలం దొంగతనాలు అనే చూపించే కొందరు దర్శకులు మానవతా కోణం ఆవిష్కరించడంలో ఫెయిల్ అయ్యారు. బీహార్ ఒక పేద రాష్ట్రం, వాళ్ళ కల్చర్, కష్టపడే తత్వాలతోనే పుష్ప రాజ్ అనే క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యారు. సినిమా అనేది ఒక వాణిజ్యమే అయినపుడు ఇప్పటి వరకు బాలీవుడ్ కూడా కేటర్ చేయని బీహార్ చేరడంలో తప్పేముంది.
ఎవడ్రా నువ్వు..
మనిషి అంటేనే గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ. సో, మనం వ్యక్తిత్వాలు డిసైడ్ చేయలేము. ప్రస్తుతం పాజిటివ్, నెగిటివ్ లను విడిచిపెడితే అల్లు అర్జున్ అందరు నోళ్ళలో నానుతూ పెద్ద విజయం సాధించారు. 'పుష్ప' సినిమాలోని నటనతో జాతీయ అవార్డు పొందిన ఆయన 'పుష్ప 2' నటవిశ్వరూపమే చూపించాడు మరి. ఈ పరిస్థితులలో ఆయన జర్నీకి ఆయన పాటే సూట్ అవుతుంది. ఒకసారి మీరు ఆ లిరిక్స్ చదవండి.
ఈ పక్క నాదే.. ఆ పక్క నాదే.. తలపైన ఆకాశం ముక్క నాదే..
ఆ తప్పు నేనే.. ఈ ఒప్పు నేనే.. తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే..
నన్నయితే కొట్టేటోడు భూమ్మీదే పుట్టలేదు..
పుట్టాడా అది మళ్ళా నేనే..
నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే అది రేపటి నేనే..
నే తిప్పానా మీసమట.. సేతిలోన గొడ్డలట.. సెసిందే యుద్దమాట.. సేయందే సంధి అటా...
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. (4)
నిను ఏట్లో ఇసిరేస్తా.. నే సేపతో తిరిగొస్తా..
గడ కర్రకు గుచ్చేస్తా.. నే జెండాలా ఎగరేస్తా..
నిను మట్టిలో పాతేసి మాయం చేస్తా..
ఖరీదైన ఖనిజంలా మళ్లీ నేను దొరికేస్తా..
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. (4)
ఎవడ్రా ఎవడ్రా నువ్వు.. ఇనుమును ఇనుమును నేను..
నను కాల్చితే కత్తి అవుతాను..
ఎవడ్రా ఎవడ్రా నువ్వు.. మట్టిని మట్టిని నేను..
నను తొక్కితే ఇటుకవుతాను..
ఎవడ్రా ఎవడ్రా నువ్వు.. రాయిని రాయిని నేను..
గాయం కానీ చేశారంటే ఖాయంగా దేవుడిని అవుతాను..
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా..