Kalki: మహేష్, నాని కాదు.. కల్కి కృష్ణుడు ఎవరంటే..
ABN , Publish Date - Jun 28 , 2024 | 07:48 PM
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం భారీతనం తోనే కాకుండా ఊహించని అతిథులను తెరపై చూపించి అలరించింది. ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచింది. ఈ చిత్రంలో ఇందులో కృష్ణుడిగా నటించింది ఎవరు? అనేది నెట్టింట హాట్ టాపిక్ మారింది
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం భారీతనం తోనే కాకుండా ఊహించని అతిథులను తెరపై చూపించి అలరించింది. ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచింది. ఈ చిత్రంలో ఇందులో కృష్ణుడిగా నటించింది ఎవరు? అనేది నెట్టింట హాట్ టాపిక్ మారింది. కురుక్షేత్రం నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో కృష్ణుడి (Krishna) పాత్రధారి ముఖాన్ని చూపించకపోవడమే ఇందుకు కారణం. ఆ క్యారెక్టర్ పోషించిన వ్యక్తి తీరును పరిశీలించి.. కొందరు హీరో మహేష్ (Mahesh)అని, నాని (Nani) అని అనుకున్నారు. మరికొందరు ఇతర హీరోల పేర్లు ప్రస్తావించారు. ఆ పోస్ట్ స్వయంగా ఆ క్యారెక్టర్ ప్లే చేసిన నటుడే సోషల్ మీడియా వేదికగా స్పందించడంతో సమాధానం దొరికినట్లైంది.
ఆయన తమిళ నటుడు కృష్ణ కుమార్ ((Krishna Kumar -KK). అతను తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ‘ఆకాశం నీ హద్దురా’తో పలకరించారు. సూర్య హీరోగా రూపొందిన ఈ మూవీలో ఆయనకు స్నేహితుడిగా నటించారు కేకే. ధనుష్ ‘మారన్’లోనూ ఆయన నటించారు. ‘కాదళగి’తో 2010లో తెరంగేట్రం చేసిన ఆయనకు నటుడిగా ‘కల్కి’ ఐదో చిత్రం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడిగా నటించి, ఆకట్టుకున్నారు. దర్శకులు రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ, అనుదీప్ కేవీ, నటుడు దుల్కర్ సల్మాన్, ఫరియా అబ్దుల్లా తదితరులు అతిథి పాత్రల్లో నటించారు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో నడుస్తోంది. మొదటిరోజు రూ. 191 కోట్లు వసూళ్లు రాబట్టింది.