Fans War: ఎవరు తగ్గారు.. ఎవరు తగ్గించారు.. బన్నీ ఫాన్స్  తెలుసుకోవాలి!

ABN , Publish Date - Jun 18 , 2024 | 01:57 PM

సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ మధ్య యుద్ధాలు (Fans war) కొత్తేమీ కాదు.. 'మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్పని, మా హీరో వసూళ్లలో తోపు అంటే.. మా హీరో బాక్సాఫీస్‌కే తురుము’ అని వాదనలు అగ్ర హీరోల సినిమాలు విడుదలైన ప్రతి సారీ చూస్తూనే ఉంటాం.

Fans War:  ఎవరు తగ్గారు.. ఎవరు తగ్గించారు.. బన్నీ ఫాన్స్  తెలుసుకోవాలి!


సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ మధ్య యుద్ధాలు (Fans war) కొత్తేమీ కాదు.. 'మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్పని, మా హీరో వసూళ్లలో తోపు అంటే.. మా హీరో బాక్సాఫీస్‌కే తురుము’ అని వాదనలు అగ్ర హీరోల సినిమాలు విడుదలైన ప్రతి సారీ చూస్తూనే ఉంటాం. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ సోషల్‌ మీడియాలో ఈ రచ్చ మొదలైంది. అయితే ఈ ఇష్యూ ఇద్దరు తెలుగు హీరోల ఫ్యాన్స్ మధ్య కాదు. తెలుగు, తమిళ హీరోల ఫ్యాన్స్ మధ్య. ఇది కూడా కొత్తేం కాదు.  అయితే ఇప్పుడు వివాదం అల్లు అర్జున్, విజయ్‌(Vijay) ఫ్యాన్స్  మధ్య. 'పుష్ప-2' (Pushpa 2)విడుదల వాయిదా పడటంతో మొదలైన రచ్చ ఇది. ఆగస్ట్‌ 15న 'పుష్ప- 2' విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్టన్ ఆలస్యం కావడంతో సినిమా విడుదల వాయిదా పడింది. తాజా ప్రకటన ప్రకారం ఈ చిత్రం డిసెంబర్‌ 6న విడుదల కానుంది.

Allu.jpg

ఈ ప్రకటనతో తమిళ సినీ ప్రియులు అల్లు అర్జున్ కి (Allu Arjun) కౌంటర్ ఇస్తున్నారు. విజయ్‌ హీరోగా నటిస్తున్న 'ది గోట్‌’ (ది  గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’) సినిమా విడుదల వాయిదా వేసిన సమయంలో అల్లు అర్జున్  ఫ్యాన్స్  విజయ్‌ని హేళనగా మాట్లాడారు. ఆగస్ట్‌లో రిలీజ్‌ కానున్న పుష్ప-2 చిత్రంతో పోటీ పడటానికి విజయ్‌ భయపడి అడుగు వెనకేశాడు’ అని అప్పట్లో కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు 'పుష్ప-2' చిత్రం విడుదల మరో నాలుగు నెలలు వెనక్కి వెళ్లింది. వెనకడుగేసింది ఎవరు? విజయ్‌ ఒక సినిమాకు బయపడి ఎప్పుడు తగ్గడు’ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

Pushpa 2.jpg
"సినిమా ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం, పోటీ ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి మార్పులు సహజంగా జరుగుతుంటాయి. నిర్మాతల అండర్‌స్టాండింగ్‌ను బట్టి డేట్స్‌ సర్దుబాటు జరుగుతుంది. అంతే కానీ విడుదల వాయిదా పడిందని, భయపడి వెనక్కు తగ్గామని కామెంట్‌ చేయడం సరికాదు. ఈ విషయాన్ని బన్నీ అభిమానులు తెలుసుకోవాలి’’ అని మరో నెటిజన్  కామెంట్‌ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6న  ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ హీరోగా నటిస్తున్న 'ది గోట్' చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది.  

Updated Date - Jun 18 , 2024 | 02:12 PM