Laila: అవే 'కళ్ళు' కానీ ఆమె కాదు..
ABN , Publish Date - Dec 16 , 2024 | 04:35 PM
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌గా నిలిస్తున్నాడు. మొదటిసారి లేడీ గెటప్ లో నటిస్తూ తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Viswak Sen) వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ యేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖి చిత్రాలతో ప్రజల ముందుకు వచ్చిన ఆయన తాజాగా మరో వైవిధ్య భరిత సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా మేకర్స్ ఓ వైవిద్యభరితమైన మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్ లో నటిస్తోన్న చిత్రం 'లైలా'. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి నిర్మిస్తోండగా రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది. జిబ్రాన్, బాలీవుడ్ ఫేమస్ తనిష్క్ సంగీతం అందిస్తున్నారు. కాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ రోజ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో విశ్వక్ ఆసక్తికరంగా ఫంకీ లుక్ లో కనిపిస్తున్నాడు.
మరోవైపు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో సైతం ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది,