Biggboss 8: విష్ణు ప్రియ ఎలిమినేటెడ్ 

ABN , Publish Date - Dec 08 , 2024 | 06:20 PM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8లో అవినాష్‌, రోహిణికి తమ ప్రతిభ చూపిస్తున్నారు. నవ్వించడమే కాకుండా టాస్కుల్లోనూ సత్తా చాటారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు తమ శాయశక్తుల ప్రయత్నించారు. కానీ ఓట్లు రాబట్టుకోవడంలోనే విఫలమయ్యారు.

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8(Biggboss 8)లో అవినాష్‌, రోహిణికి తమ ప్రతిభ చూపిస్తున్నారు. నవ్వించడమే కాకుండా టాస్కుల్లోనూ సత్తా చాటారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు తమ శాయశక్తుల ప్రయత్నించారు. కానీ ఓట్లు రాబట్టుకోవడంలోనే విఫలమయ్యారు. అయినా నబీల్‌ సాధించిన ఎవిక్షన్‌ షీల్డ్‌ సాయంతో అవినాష్‌ ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకున్నాడు. తర్వాత గట్టిగా ఆడి ఫినాలే కు చేరుకున్నారు. కానీ రోహిణికి ఆ అవకాశం లేకుండా పోయింది. ఎంత గట్టిగా ఆడినా తొలిసారి నామినేషన్స్‌లోకి రావడంతో ఆమెకు పెద్దగా ఓట్లు రాలేదు, ఫలితంగా ఎలిమినేట్‌ అయిపోయింది. నేడు మరో టాప్‌ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అవుతోంది. ఆమె ఎవరో కాదు విష్ణుప్రియ (Vishnu Priya). ఈమెకు విపరీతమైన ఫ్యాన్‌బేస్‌ ఉంది.

bb.jpg

తన నిజాయితీకి ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. కానీ గెలవాలన్న కసి తనలో లేకపోవడం, పృథ్వీ మైకంలో మునగడంతో విన్నర్‌ అయ్యేంత దమ్మున్న ఈ లేడీ కంటెస్టెంట్‌ ఈ రోజు బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడనుంది. చుట్టూ కెమెరాలున్నాయి అని  ఆలోచించకుండా తన మనసుకు ఏది అనిపిస్తే అది మాట్లాడేది. హోస్ట్‌ నాగార్జునతో మోస్ట్‌ జెన్యున్‌ పర్సన్‌ అని కితాబు అందుకుంది. నిజమే.. బిగ్‌బాస్‌ చరిత్రలోనే అత్యంత నిజాయితీగా, ఎలాంటి ముసుగు వేసుకోని కంటెస్టెంట్‌గా విష్ణు నిలిచిపోనుంది. వారమంతా ఎలా ఉన్నా వీకెండ్‌లో మాత్రం దుమ్ముదులిపే విష్ణు.. హౌస్‌లో చివరి ఫన్‌ టాస్క్‌నూ హుషారుగా పాల్గొంది. ఈ మేరకు ప్రోమో రిలీజైంది. ఏదేమైనా ఈ సీజన్‌లో లేడీ విన్నర్‌ అయ్యే ఛాన్స్‌ విష్ణు ప్రియ చేతులారా పోగొట్టుకుంది. 

Updated Date - Dec 08 , 2024 | 06:52 PM