Vishnu Manchu: మంచు విష్ణు శాంతి సందేశం

ABN , Publish Date - Dec 13 , 2024 | 08:37 PM

మంచు ఫ్యామిలీలో ఏర్పడిన మంటలు చల్లార్చే దిశగా మంచు కుటుంబం అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మంచు కుటుంబంలో వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. మనోజ్, మోహన్ బాబు, విష్ణు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడుతాయ అని అందరు ఎదురు చూస్తున్నారు. రాచకొండ సీపీ వార్నింగ్ గొడవని శాంతియుతంగా ముగించేసేందుకు మంచు ఫ్యామిలీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు.


మంచు కుటుంబంలో ఏర్పడిన అలజడులు ఎలాంటి నెగిటివిటీ లేకుండా క్లియర్ చేసుకునేందుకు మంచు ఫ్యామిలీ అడుగు ముందుకు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మంచు విష్ణు 'X' ఖాతా ద్వారా పోస్టు చేస్తూ.. ' నా హృదయానికి దగ్గరైన ఓ విషయాన్ని రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు మీతో షేర్ చేసుకుంటా' అంటూ రాసుకొచ్చారు. అలాగే #StayPositive #LiveNoNegative అనే హ్యాష్ ట్యాగ్ లను జోడించారు. దీంతో విష్ణు ఏం మాట్లాడనున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రాచకొండ సీపీ ఆదేశాల మేరకు మంచు విష్ణు, మంచు మనోజ్ విచారణకు హాజరయ్యారు.


మరోవైపు మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆయన కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశముంది.

Updated Date - Dec 13 , 2024 | 08:44 PM