Nithiin: 12 ఏళ్ల తర్వాత.. జానర్‌ ఏంటో?

ABN , Publish Date - Mar 18 , 2024 | 02:37 PM

దాదాపు పదేళ్లు వరుస ఫ్లాప్‌ల తర్వాత ‘ఇష్క్‌’ సినిమాతో హిట్‌ అందుకున్నారు నితిన్(Nithiin). ఆయన కెరీర్‌కు మరచిపోలేని చిత్రమిది. తన కెరీర్‌ మళ్లీ గాడిలో పడడానికి అవకాశం ఇచ్చిన సినిమా అది.

Nithiin: 12 ఏళ్ల తర్వాత.. జానర్‌ ఏంటో?

దాదాపు పదేళ్లు వరుస ఫ్లాప్‌ల తర్వాత ‘ఇష్క్‌’ సినిమాతో హిట్‌ అందుకున్నారు నితిన్(Nithiin). ఆయన కెరీర్‌కు మరచిపోలేని చిత్రమిది. తన కెరీర్‌ మళ్లీ గాడిలో పడడానికి అవకాశం ఇచ్చిన సినిమా అది. అందుకే ఆయనకు ఆ చిత్రమంటే విపరీతమైన ప్రేమ. కొత్త తరహా స్క్రీన్ ప్లేతో సినిమాలు తీసే విక్రమ్‌ కె.కుమార్‌(Vikram k kumar) ఓ సింపుల్‌ లవ్‌ స్టోరీ కూడా తీయగలడని నిరూపించిన సినిమా అది. అయితే ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాలేదు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఈ కాంబోలో ఓ సినిమా రాబోతోంది. నితిన్‌, విక్రమ్‌ మళ్లీ పని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాని నితిన్‌ తన సొంత బ్యానర్‌లోనే నిర్మించాలని చూస్తునట్లు సమాచారం.

గత ఏడాది ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్‌ట్రా’ సినిమాలతో పరాజయం అందుకున్నారు నితిన్‌. ప్రస్తుతం 'రాబిన్‌ హుడ్‌’ సినిమా చేస్తున్నాడు. మరో చిత్రం ‘తమ్ముడు’ కూడా సెట్స్‌పై ఉంది. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక  విక్రమ్‌ కె.కుమార్‌తో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ప్రస్తుతం విక్రమ్‌ నితిన్‌ కోసం కథని సిద్థం చేేస పనిలో బిజీగా ఉన్నారని టాక్‌. పూర్తి వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Mar 18 , 2024 | 02:37 PM