Vijay Deverakonda: ఆ బ్రాండ్ పోయింది.. ఇంకోటి వచ్చింది

ABN , Publish Date - Nov 11 , 2024 | 05:09 PM

కమర్షియల్ యాడ్స్ అండ్ ప్రమోషన్స్‌తోను విజయ్ దేవరకొండ ఇండియాలోనే టాప్ ఎర్నర్స్‌లో ఒకరిగా ఉన్నారు. కాగా ఇటీవల ఆయనకు ఒక నేషనల్ బ్రాండ్ దూరం అయింది. అయితేనేం ఇప్పుడు తాజాగా ఖాతాలోకి ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ వచ్చి చేరింది. ఇంతకీ ఏమైందంటే..

రౌడీ బాయ్ 'విజయ్ దేవరకొండ' మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ఎలాంటి సినిమాల రిలీజ్ లేకపోయినా ఆయన వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు. వరుస ప్లాప్స్‌తో సతమతమైన విజయ్.. ప్రస్తుతం టాలెంటడ్ డైరెక్టర్‌లతో కలిసి స్ట్రాంగ్ లైనప్‌తో మంచి కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సినిమాల విషయం పక్కన పెడితే కమర్షియల్ యాడ్స్ అండ్ ప్రమోషన్స్‌తోను విజయ్ ఇండియాలోనే టాప్ ఎర్నర్స్‌లో ఒకరిగా ఉన్నారు. కాగా ఇటీవల ఆయనకు ఒక నేషనల్ బ్రాండ్ దూరం అయింది. అయితేనేం ఇప్పుడు తాజాగా ఖాతాలోకి ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ వచ్చి చేరింది. ఇంతకీ ఏమైందంటే..


అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా రిలీజ్ నేపథ్యంలో ప్రముఖ దేశీయ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ థమ్స్ అప్ బన్నీ యాడ్ క్యాంపెన్ కోసం సెలక్ట్ చేసింది. అయితే అప్ప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో థమ్స్ అప్ యాడ్ క్యాంపెన్ రన్ చేస్తున్న విజయ్ ఆ డీల్ నుండి బయటికొచ్చినట్లే తెలుస్తోంది. అయితే తాజాగా ఆయనకు ప్రముఖ చికెన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చెయిన్ 'కె‌ఎఫ్‌సి' విజయ్ దేవరకొండతో సూపర్ డీల్ కుదిరించుకుంది. దీంతో ఒకటి పోతేనేం.. మరొకటి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.

Snapinsta.app_466416243_1622688495297686_6516255023987152578_n_1080.jpgSnapinsta.app_465953448_592364556465104_7624419539547835639_n_1080.jpgSnapinsta.app_465903007_594580072916220_1549319860325317099_n_1080.jpgSnapinsta.app_465898769_1264592817899566_2311880995285837664_n_1080.jpg


ప్రస్తుతం విజయ్.. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, రవి కిరణ్ కోలా, రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఓ మూడు సినిమాలు చేయనున్నాడు. ఇక VD 14 కథ విషయానికొస్తే.. రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటీకే రిలీజ్ చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ ఆసక్తి కలిగిస్తోంది. బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దాని మీద 'ది లెజెండ్‌ ఆఫ్‌ ది కర్స్డ్‌ ల్యాండ్‌' అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 11 , 2024 | 05:09 PM