Vijay Devarakonda: నాగి యూనివర్స్‌లో మేమంత పాత్రలు చేశామంతే!
ABN , Publish Date - Jul 01 , 2024 | 10:53 AM
నాగి (Nag Ashwin) యూనివర్స్‌లో మేమంత పాత్రలు చేశామంతే! ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో భారతీయ సినిమా మరో స్థాయికి వెళ్లిందని విజయ్ దేవరకొండ అన్నారు.
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898AD) సినిమాతో భారతీయ సినిమా మరో స్థాయికి వెళ్లిందని విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలై సూపర్‌హిట్ టాక్‌తో ముందుకెళ్తుంది. నాలుగు రోజుల్లో రూ. 500 కోట్లు వసూళ్లు రాబట్టిందని నిర్మాత సంస్థ వెల్లడించింది. ‘కల్కి’లో అర్జునుడి పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు.
‘‘కల్కి’ సినిమా చూశా. చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఇండియన్ సినిమా మరో లెవల్‌కి వెళ్లింది. నాగి, ప్రభాస్ గురించి చేసిన క్యారెక్టర్ అది. అర్జునుడిగా మూవీ చివరిలో కనిపించడం, ఆ పాత్ర చేయడం నాకు సంతోషంగా ఉంది. తెరపై విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్నట్లు చూడొద్దు. నన్ను అర్జునుడిగా.. ఆయనను కర్ణుడిగా మాత్రమే చూడాలి. నాగి యూనివర్స్‌లో మేమంత పాత్రలు చేశామంతే. నాగి ప్రతి సినిమాలో నేను చేయడం తను లక్కీఛార్మ్ అని చెప్పొచ్చు. సినిమాలు బాగున్నాయి కాబట్టి ఆడుతున్నాయి. నేను చేయడం వల్లే అతడి సినిమాలు ఆడటం లేదు. ‘మహానటి’ ‘కల్కి’ రెండూ గొప్ప సినిమాలు. అందులో మేం నటించామంతే’’ అని అన్నారు.
‘‘కల్కి పార్ట్-2’లో మీ పాత్ర ఇంకాస్త ఎక్కువ ఉంటుందని అశ్వనీదత్ అన్నారు. దీనిపై మీ స్పందన ఏంటని అడగగా.. ‘ఆయన ఏది చెబితే అది కరెక్ట్’ అని విజయ్ దేవరకొండ జవాబిచ్చారు. ఈ ఏడాదిలో 'ఫ్యామిలీస్టార్'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు విజయ్. ఆ చిత్రం మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు అతను వరుసగా మూడు చిత్రాల్లో నటిస్తున్నారు.