Vijay and Rashmika: ఇష్టమైన సినిమా.. హిందీలో దుమ్ములేపుతోంది!
ABN , Publish Date - Jun 15 , 2024 | 08:28 PM
‘డియర్ కామ్రేడ్’పై (Dear Comrade) హిందీ ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరణకు ఇన్ స్టాగ్రామ్ వేదికగా దన్యవాదాలు తెలిపారు
‘డియర్ కామ్రేడ్’పై (Dear Comrade) హిందీ ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరణకు ఇన్ స్టాగ్రామ్ వేదికగా దన్యవాదాలు తెలిపారు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - రష్మిక (Rashmika mandanna) జంటగా నటించిన ఈ చిత్రం 2019లో విడుదల కాగా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, ఈ చిత్రం హిందీ వెర్షన్‌కు యూట్యూబ్‌లో భారీ ప్రేక్షకాదరణ లభించింది. 400 మిలియన్ల మంది ఈ చిత్రాన్ని వీక్షించారు. దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ విజయ్ దేవరకొండ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌కు రష్మిక స్పందించారు. (Dear comrade hindi version)
‘400 మిలియన్ల మంది ‘డియర్ కామ్రేడ్’ వీక్షించారు. 2019లో ఈ సినిమా రిలీజైన రోజు వచ్చిన స్పందనకు మేమెంతో బాధపడ్డాం.. కానీ, ఈరోజుకూ ఈ మూవీ అంటే మాకెంతో ఇష్టం, ప్రత్యేకం. ‘డియర్ కామ్రేడ్’ నాకు నచ్చిన సినిమా.. నచ్చిన కథ’ అని పేర్కొన్నారు.
ఈ పోస్ట్‌ను రష్మిక తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. ‘400 మిలియన్స్ లవ్. ‘డియర్ కామ్రేడ్’ నాకెప్పటికీ అత్యంత ప్రత్యేకమైన సినిమా’ అని రాసుకొచ్చారు. ఇక విజయ్-రష్మిక కలిసి రెండు సినిమాల్లో నటించారు. వాటిలో ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ‘డియర్ కామ్రేడ్’ అంచనాలను అందుకోనప్పటికీ స్క్రీన్ పై ఈ జోడి ప్రేక్షకులకు వినోదాన్నిచ్చింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ మూడు చిత్రాల్లో నటిస్తుండగా రష్మిక 5 సినిమాల్లో అలరించేందుకు సిద్థంగా ఉన్నారు.