Vijay Devarakonda: లవ్‌ - రిలేషన్‌ టాపిక్‌పై విజయ్‌ దేవరకొండ ఏమన్నారంటే..

ABN , Publish Date - Dec 19 , 2024 | 01:38 PM

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ఇప్పటి యూత్‌ హీరోల్లో ఒక బ్రాండ్‌. ఆయన ఏదైనా వేదిక ఎక్కి మాట్లాడితే వార్తల్లో నిలవడం తప్పనిసరి. అయితే అది ఈ మధ్యన కాస్త తగ్గింది. ఆయన మీద రిలేషన్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలు మాత్రం ఆగేలా కనిపించడం లేదు.


విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ఇప్పటి యూత్‌ హీరోల్లో ఒక బ్రాండ్‌. ఆయన ఏదైనా వేదిక ఎక్కి మాట్లాడితే వార్తల్లో నిలవడం తప్పనిసరి. అయితే అది ఈ మధ్యన కాస్త తగ్గింది. ఆయన మీద రిలేషన్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలు మాత్రం ఆగేలా కనిపించడం లేదు. తాజాగా ఆయన దీనిపై స్పందించారు. తాజాగా ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ డేటింగ్‌ రూమర్స్‌ (Dating rumours) గురించి మాట్లాడారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు దానికి గురించి అందరికీ తెలిసేలా చెబుతారు అని అన్నారు. (Vijay Devarakonda onDating rumours)

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘నేను  సిద్థంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా. ప్రపంచం తెలుసుకోవాలి, అందరితో పంచుకోవాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయట పెడతా. దానికంటూ ఒక ప్రత్యేక కారణం, సమయం ఉండాలి. కాబట్టి, అలాంటి రోజు సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా. పబ్లిక్‌ ఫిగర్‌గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది.  అదీ.. వృత్తిలో భాగంగా భావిస్తా. దాని నుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను. వార్తలను కేవలం వార్తలు గానే చూస్తా. ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా’’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు. అనంతరం ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ.. ‘‘అపరిమితమైన ప్రేమ అనేది ఉందో, లేదో నాకు తెలియదు. ఒకవేళ అదే ఉంటే.. దానితోపాటే బాధ కూడా ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు విజయ్‌. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిత్రమ స్పందనకే పరిమితమైంది.  తదుపరి ‘కల్కి 2898 ఏడీ’లో అర్జునుడిగా అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన  'VD12’ కోసం వర్క్‌ చేస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. 

Updated Date - Dec 19 , 2024 | 01:38 PM