Hitler: 27న థియేట‌ర్ల‌లోకి.. విజయ్‌ ఆంటోనీ ‘హిట్లర్‌’

ABN , Publish Date - Sep 02 , 2024 | 06:20 PM

నిత్యం వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న న‌టుడు విజయ్ ఆంటోనీ. ఇటీవ‌లే తుఫాన్ మూవీతో ప‌ల‌క‌రించిన ఆయ‌న త్వ‌ర‌లో మ‌రో కొత్త సినిమా ‘హిట్లర్’తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

hitler

నిత్యం వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న న‌టుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony). ఇటీవ‌లే తుఫాన్ మూవీతో ప‌ల‌క‌రించిన ఆయ‌న త్వ‌ర‌లో మ‌రో కొత్త సినిమా ‘హిట్లర్’(Hitler)తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ ఆంటోనీతో గతంలో ‘విజయ్ రాఘవన్’ అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ (Chendur Film) ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా యాక్షన్ థ్రిల్లర్ కథతో ‘హిట్లర్’ సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు కాగా ‘పడైవీరన్‌ ’, ‘వానమ్‌ కొట్టటుమ్‌’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ధన (Dhana) దర్శకత్వం వహించారు.

GWVJ2dMXsAAhcdC.jpeg

డిక్టేటర్ లాంటి ఒక రాజకీయ నాయకుడు, అతన్ని వేటాడే ఓ కిల్లర్, ఆ ప్లాన్‌ను అడ్డుకుని.. కిల్లర్‌ను టార్గెట్ చేసిన ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అనే పాత్ర‌ల చుట్టూ ఈ సినిమా సాగనుంది. అయితే.. తాజాగా ఈ చిత్రాన్ని‘హిట్లర్‌’ చిత్రాన్ని ఈ నెల 27వ తేదీన విడుదలచేయనున్నట్టు దర్శక నిర్మాతలు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.


విజయ్‌ ఆంటోనీ సరసన రియా సుమన్ (Riya Suman)హీరోయిన్‌గా నటించింది. చాలా గ్యాప్‌ తర్వాత సీనియర్‌ నటుడు చరణ్‌ రాజ్‌ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. గౌతం మేనన్‌, రెడిన్‌ కింగ్‌స్లీ, వివేక్‌ ప్రసన్న, ఆడుకళం నరేన్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. వివేక్‌ - మెర్విన్‌ ద్వయం సంగీతం అందించగా చివరి దశ పోస్ట్‌ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 27న విడుదల చేయనున్నారు.

Updated Date - Sep 02 , 2024 | 06:20 PM