SJ Suryah: ఆ సినిమా 'గేమ్‌ ఛేంజర్‌’తో పోటీనే కాదు..

ABN , Publish Date - Dec 01 , 2024 | 08:29 PM

తమ సినిమా 'గేమ్‌ ఛేంజర్‌’ విడుదలవుతున్న సమయంలోనే అజిత్‌ నటిస్తోన్న ‘విదాముయార్చి’(Vidaamuyarchi) రిలీజ్‌ అవతుండడంపై ఆయన స్పందించారు. తమ మధ్య ఎలాంటి పోటీ ఉండదన్నారు.

రామ్‌చరణ్‌ (Ram charan) నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’(Game Changer)లో కీలక పాత్ర పోషించారు కోలీవుడ్‌ నటుడు ఎస్‌.జె.సూర్య(SJ Surya) తమ సినిమా విడుదలవుతున్న సమయంలోనే అజిత్‌ నటిస్తోన్న ‘విదాముయార్చి’(Vidaamuyarchi) రిలీజ్‌ అవతుండడంపై ఆయన స్పందించారు. తమ మధ్య ఎలాంటి పోటీ ఉండదన్నారు. ప్రేక్షకులు ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని ఆదరిస్తారని అన్నారు. ‘‘విదాముయార్చి’ కంటే ముందే మా సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించాం. ఆ మేరకు వర్క్‌ చేస్తున్నాం. వాళ్లు సడన్‌గా తమ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అజిత్‌ సినిమా విడుదలైనప్పుడు తమిళనాడులో తప్పకుండా భారీ స్థాయిలో  ఓపెనింగ్స్‌ ఉంటాయి.  అదే విధంగా ప్రేక్షకులు మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారు. కాబట్టి దానిని పోటీగా చూడాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయిక. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా  తెరకెక్కింది. శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, అంజలి కీలక పాత్రలు పోషించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఇది విడుదల కానుంది. భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ‘విదాముయార్చి’ చిత్రానికి మాగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీగా ఇది తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. త్రిష కథానాయిక. అర్జున్‌, రెజీనా తదితరులు కీలక పాత్రధారులు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.  

Updated Date - Dec 01 , 2024 | 08:29 PM