Venkatesh: వెంకీ మామ వారసుడి ఎంట్రీపై క్లారిటీ
ABN , Publish Date - Dec 27 , 2024 | 08:37 AM
Venkatesh: ఇప్పటికే చిరు వారసుడిగా రామ్ చరణ్ అదరగొడుతుంటే, బాలయ్య వారసుడి ఎంట్రీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇక నాగ్ వారసులు ఎంట్రీ ఇచ్చిన స్టార్‌డమ్ మాత్రం అందుకోలేకపోయారు. ఇక మిగిలింది వెంకటేష్ వారసుడే. తాజాగా వెంకీ వారసుడి ఇండస్ట్రీ ఎంట్రీపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసత్వ కథానాయకులకు కొదవలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కుంటుబాల నట వారసత్వం నుండి అనేక కుటుంబాలు ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ప్రధానంగా 80, 90 దశకాల్లో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీ నాలుగు స్తంభాలుగా నిలబడ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్. ఇప్పటికే చిరు వారసుడిగా రామ్ చరణ్ అదరగొడుతుంటే, బాలయ్య వారసుడి ఎంట్రీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇక నాగ్ వారసులు ఎంట్రీ ఇచ్చిన స్టార్‌డమ్ మాత్రం అందుకోలేకపోయారు. ఇక మిగిలింది వెంకటేష్ వారసుడే. తాజాగా వెంకీ వారసుడి ఇండస్ట్రీ ఎంట్రీపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సంక్రాంతికి 'సంక్రాంతి వస్తున్నాం' సినిమాతో వెంకటేష్ అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రమోషన్స్ నిమిత్తం బాలకృష్ణ ఆన్ స్టాపబుల్ సీజన్ 4 కి గెస్టుగా వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రోమో కూడా రిలీజై ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది. అయితే ఈ షోలో వెంకటేష్ నట వారసత్వం బాలయ్య ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై వెంకీ కూడా క్లారిటీ ఇచ్చేశారట. ఇంతకీ వెంకీ మామ ఏం చెప్పాడు అనేది తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యదాకా వేచి చూడాల్సిందే. వెంకటేష్, నీరజ దంపతులకి నలుగురు సంతానం ముగ్గురు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నారు. 20 ఏళ్ళ కుమారుడు అర్జున్ ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నాడు. పెద్ద కూతురు ఆశ్రిత రెడ్డి హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిని పెళ్లి చేసుకుంది.
ఇంకా 'సంక్రాంతి వస్తున్నాం' సినిమా విషయానికొస్తే.. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని గోదారి గట్టు, మీను సాంగ్స్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్లుగా నిలిచాయి.