Daggubati Venkatesh: గన్ పట్టుకున్న వెంకీ.. దిల్ రాజు కన్ఫ్యూజ్
ABN , Publish Date - Nov 20 , 2024 | 06:37 PM
సినిమా పేరుతో 'సంక్రాంతికి వస్తున్నాం' అని ఉన్న సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందో కాదో అనే కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే హీరో వెంకటేష్ చేతిలో గన్ను పట్టుకొని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ప్రొడ్యూసర్ దిల్ రాజు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల సక్సెస్ తర్వాత విక్టరీ వెంకటేశ్(Venkatesh) - దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastyunnam). ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి మార్క్ ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా సిద్థమవుతోంది. అయితే ఈ సినిమా రిలీక్ పై కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే హీరో వెంకటేష్ అందరికి క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
రీసెంట్ గా జరిగిన సినిమా ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ.." ఈ సినిమా టైటిల్ 'సంక్రాంతి వస్తున్నాం' అలాగే మేము ఈ సంక్రాంతికి రావడం ఖాయం అన్నారు. ఈ సినిమా రిలీజ్పై నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మా ప్రొడ్యూసర్ దిల్ రాజుకే వన్ వీక్ క్రితం వరకు కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు ఆయనకు కూడా క్లారిటీ వచ్చేసింది. సినిమా బిగినింగ్ నుండి సంక్రాంతికే రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశాము. ఇప్పడు అదే" జరుగుతుందన్నారు.
అయితే ఫైనల్గా సినిమాని జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో వెంకీ మామ గన్ చేతిలో పట్టుకొని అదుర్స్ అనిపిస్తునాడు. ఇక జనవరి 10న రిలీజ్ కానున్న రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్' వంటి పెద్ద సినిమాలతో ఈ సినిమా పోటీ పడాల్సి వస్తుంది. అయితే వెంకీ మామ ఉండగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కడికి పోతారని కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ సంక్రాంతి దిల్ రాజు వర్సెస్ దిల్ రాజుగా సాగనుంది.