Varun Tej: 175 రోజుల త‌ర్వాత షూటింగ్‌కు వరుణ్ తేజ్.. RFCలో మ‌ట్కా కీల‌క షెడ్యూల్‌

ABN , Publish Date - Jun 20 , 2024 | 09:19 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా న‌టిస్తోన్న‌ పాన్-ఇండియన్ మూవీ మట్కా. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభమైంది.

Varun Tej: 175 రోజుల త‌ర్వాత షూటింగ్‌కు వరుణ్ తేజ్.. RFCలో మ‌ట్కా కీల‌క షెడ్యూల్‌
matka

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej Konidela) తన అప్ కమింగ్ పాన్-ఇండియన్ మూవీ మట్కా (Matka)తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. కరుణ కుమార్ ( Karuna Kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ డా. విజయేందర్ రెడ్డి తీగల, SRT ఎంటర్టైన్మెంట్స్ రజనీ తాళ్లూరితో కలిసి నిర్మిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshii Chaudhary), నోరా ఫతేహి (Nora Fatehi) క‌థానాయుక‌లుగా న‌టిస్తోండ‌గా నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి. రవి శంకర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ మట్కా మూవీ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమవ‌గా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ లెన్తీ 40-రోజుల ముఖ్యమైన షెడ్యూల్ కోసం RFCలో మ్యాసీవ్ సెట్‌ నిర్మించి చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి ఈ షెడ్యూల్‌లో పార్ట్ అయ్యారు.

F2C0IbPX0AM8KzT.jpeg


"మట్కా" దేశం అంతటా సెన్సేషన్ క్రియేట్ చేసిన నిజ జీవిత సంఘటనల అధారంగా చేసుకుని ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వ‌రుణ్‌తేజ్ (Varun Tej Konidela) నాలుగు డిఫరెంట్ అవతార్‌ల‌లో కనిపించ‌నుండ‌డం విశేషం. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ ఎ. కిషోర్ కుమార్ అందిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ (G.V.Prakash Kumar) సంగీతం సమకూరుస్తున్నారు. ఎడిటింగ్‌ను కార్తీక శ్రీనివాస్ ఆర్ హ్యాండిల్ చేస్తున్నారు.

Updated Date - Jun 20 , 2024 | 09:19 PM