Varun Tej: తొలిసారి హనుమాన్ దీక్ష.. లేటెస్ట్ అప్‌డేట్..
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:52 PM
తొలిసారి హనుమాన్ దీక్ష తీసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వరుణ్‌తేజ్‌కు ఘన స్వాగతం పలికారు.
తొలిసారి హనుమాన్ దీక్ష (Hanuman Deeksha) తీసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (varun Tej) కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వరుణ్‌తేజ్‌కు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం శాలువాతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. కొండగట్టు ఆలయ ప్రాముఖ్యతను వరుణ్ తేజ్‌కు వివరించారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ "కొండగట్టు అంజన్న (Kondagattu Anjanna) చాలా పవర్ ఫుల్ దేవుడు. మొదటిసారి హనుమాన్ దీక్ష తీసుకున్నా.. అంజన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అన్నారు.
సినిమాల రిజల్ట్‌తో పని లేకుండా డిఫరెంట్ కథలతో ముందుకెళ్తున్నారు వరుణ్ తేజ్. మరోసారి కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మేర్లపాక గాంధీ (Merlapaka gandhi) దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇండో కొరియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు సమాచారం.. దీనికోసం వరుణ్ తేజ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఫ్రెష్ అండ్ యూనిక్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడని టీమ్ చెబుతోంది.