Nindha: తెలుగు రాష్ట్రాల్లో.. దూసుకుపోతున్న వరుణ్ సందేశ్ ‘నింద’

ABN , Publish Date - Jun 24 , 2024 | 07:23 PM

కాస్త గ్యాప్ త‌ర్వాత వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టించిన నింద అనే చిత్రం గ‌త వారం థియేట‌ర్ల‌లోకి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

Nindha: తెలుగు రాష్ట్రాల్లో.. దూసుకుపోతున్న వరుణ్ సందేశ్ ‘నింద’
nindha

కాస్త గ్యాప్ త‌ర్వాత వ‌రుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా న‌టించిన నింద అనే చిత్రం గ‌త వారం థియేట‌ర్ల‌లోకి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించ‌గా రాజేష్ జగన్నాధం (Rajesh jagannadham) దర్శకత్వం వహించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి మంచి టాక్, రివ్యూలు వచ్చాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

వరుణ్ సందేశ్ (Varun Sandesh) కెరీర్‌లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్‌ సాధించిన ఈ సినిమా ఈ వారంలో రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లోకెల్లా నింద స్ట‌డీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. ఈ వీకెండ్‌లో తెలుగు రాష్ట్రాల్లో నెం.1 వసూళ్లు సాధించిన చిత్రంగా నింద నిలవనుంది. మంచి బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పెట్టుబడిని రికవరీ చేస్తూ కమర్షియల్‌గా హిట్‌ అవుతుందని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Varun-Sandesh-nindha.jpg


అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఇతర ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రానికి రమీజ్ నవీత్ కెమెరా, సంతు ఓంకార్ సంగీతం అందించారు. అనిల్ కుమార్ ఎడిటింగ్ చేశారు.

Updated Date - Jun 24 , 2024 | 07:23 PM