Varun Sandesh: వరుణ్ సందేశ్.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘కానిస్టేబుల్’

ABN , Publish Date - Aug 28 , 2024 | 07:48 PM

వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో రూపొందుతున్న‌ చిత్రం “కానిస్టేబుల్". ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు.

Varun Sandesh

వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్". వరుణ్ సందేశ్ కి జోడిగా మధులిక వారణాసి (Madhulika Varanasi) హీరోయిన్ గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను .నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగా బుధవారం సాయంత్రం డివో మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేశారు.

varun

ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh) మాట్లాడుతూ, "సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మోషన్ పోస్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కానిస్టేబుల్‌గా కొత్తకోణం ఉన్న‌ పాత్రలో, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. తప్పకుండా ఈ చిత్రం నా కెరీర్ ను మరో మలుపు తిప్పుతుంది" అని చెప్పారు.


3H4A0653.JPG

నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, "కథ, కథ‌నాలు అద్భుతంగా అమరిన చిత్రమిది. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటారు" అని పేర్కొన్నారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, "సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో వరుణ్ సందేశ్ నట విశ్వరూపం చూడవచ్చు. మోషన్ పోస్టర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉంటుంది"అని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులున‌టించారు.

Updated Date - Aug 28 , 2024 | 07:48 PM