Vanitha Vijay Kumar: వనిత విజయకుమార్.. నాలుగో పెళ్లికి సై?
ABN , Publish Date - Jul 29 , 2024 | 09:05 AM
తమిళ చిత్ర పరిశ్రమలో వివాదాస్పద నటి గా గుర్తింపు పొందిన వనిత విజయకుమార్ నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు కోలీవుడ్‌లో మరో మారు ప్రచారం సాగుతోంది.
తమిళ చిత్రపరిశ్రమలో వివాదాస్పద నటి గా గుర్తింపు పొందిన వనిత విజయకుమార్ (Vanitha Vijaykumar) నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. 2000లో నటుడు ఆకాష్‌ను తొలిసారి వివాహం చేసుకున్నా రు. వీరికి విజయ్ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలున్నారు. ఆ తర్వాత ఆకాష్ నుంచి విడిపోయి ఆనంద్ అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి జయనిత అనే కుమారుడు ఉన్నారు.
అయితే, పెద్ద కుమారుడు విజయ్ హరి తండ్రితో ఉండేలా కోర్టు ఆదేశించడంతో తండ్రితో కలిసి ఉంటున్నాడు. రెండో భర్తకు జన్మించిన జయనిత కూడా తండ్రి వద్దే ఉండగా, వనిత దగ్గర కుమార్తె జోవికా మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో 2020లో పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకుంది కానీ, అతడితో మనస్పర్థల కారణంగా దూరమైంది. అప్పటి నుంచి సినిమాలపై దృష్టి కేంద్రీకరించింది.
ఈ పరిస్థితుల్లో ఆమె నాలుగోసారి పెళ్లి చేసుకోబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. సొంతంగా యూట్యూబ్ చానెల్ నడుపుతున్న ఆమె.. ఓ అభిమాని ప్రశ్నకు సమాధానమిస్తూ, ఊహించని దాని కోసం ఎదురు చూడండి అంటూ సమాధానమిచ్చింది. దీంతో ఆమె మరోమారు పెళ్లి పీటలెక్కనున్నారనే ప్రచారం సాగుతుంది.