JR NTR: తారక్‌ కోసం ఇద్దరు హీరోయిన్లు..

ABN , Publish Date - Jun 25 , 2024 | 10:54 AM

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ (Ntr) తాజాగా నటిస్తున్న చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ (Koratala shiva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రూపొందుతుంది.

JR NTR: తారక్‌ కోసం ఇద్దరు హీరోయిన్లు..



మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ (Ntr) తాజాగా నటిస్తున్న చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ (Koratala shiva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రూపొందుతుంది. సముద్రం బ్యాక్‌ డ్రాప్‌లో తీర్చిదిద్దుతున్న ఈ చిత్రం మొదటి పార్టును సెప్టెంబర్‌ 27 న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల థాయ్‌ల్యాండ్‌లో ఓ పాటను చిత్రీకరించుకుని టీమ్‌ హైదరాబాద్‌ చేరుకుంది. మరో పక్క నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దీంతోపాటు తారక్‌ హిందీలో వార్‌-2, ప్రశాంత్  నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. డ్రాగన్ అనే పేరు ఈ చిత్రానికి పరిశీలనలో ఉంది.  మైత్రి మూవీ మేకర్స్‌  భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో మొదలుకానుందని ఎన్టీఆర్‌ పుట్టినరోజున ప్రకటించారు.

Tarak.jpeg

'దేవర’ పూర్తి కాగానే ప్రశాంత్  నీల్‌ (Prashanth neel) ఈ సినిమా డ్యూటీ ఎక్కనున్నారు. అయితే ఈ చిత్రంలో కథానాయికగా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika mandanna) కథానాయికగా ఎంపికైనట్లు వార్తలొచ్చాయి. తాజాగా మరో వార్త వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ గ్లామర్‌ డాల్‌ అలియాభట్‌ (Alia bhatt) కూడా ఈ చిత్రంలో భాగం కానుందట. అయితే ఆమె హీరోయిన్ గానా, లేక ప్రత్యేక పాత్రలో కనిపించనుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. అలియా ఇప్పటికే తెలుగులో ఆర్‌ఆర్‌ఆర్‌తో మెప్పించిన సంగతి తెలిసిందే!

Updated Date - Jun 25 , 2024 | 10:54 AM