Lavanya - Raj Tarun: ఆధారాలు సమర్పించాలని నోటీసులు!
ABN , Publish Date - Jul 06 , 2024 | 12:34 PM
హీరో రాజ్‌తరుణ్‌పై అతని ప్రేయసి లావణ్య కేసులో కేసు పెట్టిన సంగతి తెలిసిందే! తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసగించాడంటూ ఆమె శుక్రవారం నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హీరో రాజ్‌తరుణ్‌పై (Raj Tarun) అతని ప్రేయసి లావణ్య (Lavanya) కేసులో కేసు పెట్టిన సంగతి తెలిసిందే! తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసగించాడంటూ ఆమె శుక్రవారం నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై హీరో రాజ్ తరుణ్ కూడా బయటికొచ్చి మాట్లాడాడు. తనను ఆమె ఎంతగా ఇబ్బంది పెడుతుందో మీడియాకు వెల్లడించాడు. తాజాగా ఈ కేసు విషయంలో లావణ్యకు ఓ ట్విస్ట్ ఎదురైంది. శుక్రవారం సాయంత్రం లావణ్యకు 91 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు (Police notice) నార్సింగ్ పోలీసులు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని లావణ్య చేసిన ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని లావణ్యకు నోటీసులు జారీ చేశారు. అయితే లావణ్య పోలీసులకు అందుబాటులో లేదని తెలుస్తోంది.