Trivikram: ఆ కారణంతోనే త్రివిక్రమ్ క్రెడిట్ వద్దనుకున్నారు
ABN , Publish Date - Apr 28 , 2024 | 05:07 PM
త్రివిక్రమ్(trivikram), విజయ్ భాస్కర్‌ది సూపర్‌హిట్ కాంబినేషన్. స్వయంవరం (Swayamvaram)తర్వాత వీరిద్దరి జోడీ సక్సెస్ ఫుల్‌గా సాగింది. నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు’ చిత్రాలు విశేషంగా అలరించాయి.
త్రివిక్రమ్(trivikram), విజయ్ భాస్కర్‌ది సూపర్‌హిట్ కాంబినేషన్. స్వయంవరం (Swayamvaram)తర్వాత వీరిద్దరి జోడీ సక్సెస్ ఫుల్‌గా సాగింది. నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు’ చిత్రాలు విశేషంగా అలరించాయి. త్రివిక్రమ్ దర్శకుడు అయ్యాక విజయ్ భాస్కర్ (Vijay Bhaskar) మరో రైటర్‌ని వెదుక్కోవాల్సివచ్చింది. ఆ కాంబోలో సినిమాలు సరిగ్గా ఆడలేదు. అక్కడ త్రివిక్రమ్ లేని లోటు.. స్పష్టంగా కనిపించింది. అయితే గతంలో త్రివిక్రమ్, విజయ్ భాస్కర్‌కు మధ్య జరిగిన చిన్న సంభాషణను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ భాస్కర్ బయటపెట్టారు.
త్రివిక్రమ్ డైరెక్టర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. పోసాని కృష్ణ మురళి దగ్గర రైటర్‌గా ఉండేవారు. కానీ ఎప్పుడు క్రెడిట్ కోసం ఆరాట పడలేదు. త్రివిక్రమ్ పూర్తి స్థాయిలో రాసిన సినిమా స్వయంవరం. విజయ్ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మొత్తం పూర్తయింది. రైటర్‌గా శ్రీనివాస్ పేరుని క్రెడిట్ కోసం ఇచ్చారట దర్శకుడు. దీనికి త్రివిక్రమ్ ఒప్పుకోలేదు. ‘దర్శకుడిగా అవకాశాలు రావు. రచయితగా పేరు వద్ధులే ని చెప్పారట. '‘బాగా రాశావ్. మాటల్లో స్పార్క్ వుంది. ఖచ్చితంగా డైలాగ్‌లు పేలతాయి. తర్వాత బాధపడతావు’ అని భాస్కర్ సముదాయించడంతో కొంత సేపు ఆలోచించి తన సెంటిమెంట్ మూడు అంకె వచ్చేలా ‘త్రివిక్రమ్’ పేరుని క్రిడెట్ కోసం ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ భాస్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే త్రివిక్రమ్ క్రెడిట్ వద్దనుకోవడానికి కారణం ఏంటంటే.. పాత రోజుల్లో రచయిత అనే ముద్ర పడితే దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన చాలామంది రాసేవారు కానీ క్రెడిట్ తీసుకునేవారు కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌లో కూడా అప్పట్లో ఆ భయం ఉండేది.