Trinadha Rao Nakkina: టాలీవుడ్ హిట్‌ చిత్రాల దర్శకుడికి పితృవియోగం!

ABN , Publish Date - Apr 30 , 2024 | 02:21 PM

టాలీవుడ్‌ దర్శకుడు నక్కిన త్రినాధరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్యరావు సోమవారం రాత్రి కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు

Trinadha Rao Nakkina: టాలీవుడ్ హిట్‌ చిత్రాల దర్శకుడికి పితృవియోగం!

టాలీవుడ్‌ దర్శకుడు నక్కిన త్రినాధరావుకు(Trinadha Rao Nakkina) పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్యరావు (Surya rao) సోమవారం రాత్రి కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో త్రినాధరావు ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు పలువురు ఆయన్ను  పరామర్శించి, తన తండ్రి ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పించారు. (Rip Suryarao)

Ileana D'Cruz: నిజాయతీగా పని చేశా.. రావలసిన గుర్తింపు రాలేదు!

'మేం వయసుకు వచ్చాం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయైున త్రినాధరావు ఆ చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత 'సినిమా చూపిస్తా మావ', 'నేను లోకల్‌’, 'హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాలతో చక్కని విజయం అందుకున్నారు. ఇటీవల రవితేజతో తీసిన 'ధమాకా’ (Dhamaka) చిత్రం సూపర్‌హిట్‌ అయిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఆయన బ్యానర్‌ను స్థాపించి సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. 

Updated Date - Apr 30 , 2024 | 03:01 PM