Top Paid Actors: బన్నీ ఎంట్రీతో ప్రభాస్ ఔట్

ABN , Publish Date - Nov 27 , 2024 | 08:15 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీతో ప్రభాస్ వెనక్కి పడిపోయారు. ఇంతకీ ఏమైందంటే

ప్రస్తుతం ఇండియాలో 'పుష్ప 2' మేనియా నడుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి.. ప్రభాస్ తో బాహుబలి సినిమా తీసిన తర్వాత ఇండియన్ సినిమా బేరియర్స్ చెదిరిపోవడంతో పాటు హీరో ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించారు. అయితే రాజమౌళి సినిమా లేకుండా ఏ ఇతర పాన్ ఇండియా సినిమా తీయకుండానే మొదటి పాన్ ఇండియా స్టార్ గా అవతరించింది బన్నీ అనే చెప్పాలి.


2009 ఆ సమయాల్లోనే అల్లు అర్జున్ కి హిందీ బెల్ట్ తో సహా కేరళలలో విపరీతమైన ఫ్యాన్ క్రేజ్ ఉంది. అందుకేనేమో ఒక ఫాంటసీ, గ్రాఫిక్స్ సినిమా కాకపోయినా ఒక పక్కా మాస్ కమర్షియల్ సినిమాతో రూ.1000 కోట్ల క్లబ్ లోకి 'పుష్ప 2' అడుగుపెట్టడం ఈజీయే అంటున్నారు. ఇటీవల ఆయనకు బీహార్ లో ఏర్పడిన క్రేజ్ చూస్తే ఏ ఇతర బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ హీరో కూడా అందుకోలేరేమో అనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే 'పుష్ప 2' సినిమా కోసం ఆయన ఛార్జ్ చేసిన రెమ్యూనరేషన్ తో ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా అవతరించారు. దీంతో ప్రభాస్ టాప్ 5 నుండి అవుట్ అయిపోయారు.


ఫోర్బ్స్ ఇండియా 2024 గణాంకాల ప్రకారం టాప్ 10 హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్

ఒక్కో సినిమాకి చొప్పున

అల్లు అర్జున్ - 300 కోట్లు

దళపతి విజయ్ - 130-275 కోట్లు

షారుఖ్ ఖాన్ - 150-250 కోట్లు

రజినీకాంత్ - 125-270 కోట్లు

అమీర్ ఖాన్ - 100-275 కోట్లు

ప్రభాస్ - 100-200 కోట్లు

అజిత్ కుమార్ - 105-160 కోట్లు

సల్మాన్ ఖాన్ - 100- 150 కోట్లు

కమల్ హాసన్ - 100-150 కోట్లు

అక్షయ్ కుమార్ - 60-145 కోట్లు

అల్లు అర్జున్ స్టామినా, పొటెన్షియల్ అంటే ఇదని ఫ్యాన్స్ తో పాటు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - Nov 27 , 2024 | 08:23 AM