Allu Arjun Arrest: మెగా పవర్ చూపించారు కదా.. ఏకమైనా ఇండస్ట్రీ

ABN , Publish Date - Dec 13 , 2024 | 09:24 PM

ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ అల్లు అర్జున్ వెనక నిలబడిన తీరు అందరిని ఆకట్టుకుంది..

నిన్నటి వరకు సోషల్ మీడియాలో రచ్చ రేపిన మెగా వర్సెస్ అల్లు గోల సమసిపోతున్నట్లు కనిపిస్తుంది. నేడు అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ కుటుంబానికి అండగా నిలిచినా తీరు అభిమానుల్లో ప్రేమ'పుష్ప'లను పూయిస్తున్నాయి. మరోవైపు ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ వెనుక నిలిచినా తీరు తెలుగు సినీ ఇండస్ట్రీ ఐక్యతని చాటి చెప్పింది.


అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు భార్య సురేఖ కూడా ఉన్నారు. అనంతరం మెగా బ్రదర్ నాగబాబు కూడా హుటాహుటిన అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ ప్రయాణమైనట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు కోర్టులో వకీల్ సాబ్ పాత్రలో అదరగొట్టిన లాయర్ నిరంజన్ రెడ్డి స్వయానా చిరు 'ఆచార్య' నిర్మాత. ఈ సన్నివేశాలతో అల్లు అండ్ మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్లేనా అనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మెగా, అల్లు అభిమానులు ఏకమయ్యారు.


ఇదంతా పక్కన పెడితే ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపడంపై టాలీవుడ్ హీరోలు ఏకమయ్యారు.హీరో నాని తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నా. సంధ్య థియేటర్‌ ఘటన నిజంగా దురదృష్టకరం. మనం ఇలాంటి ఘటన నుంచి నేర్చుకోవాలి. జాగ్రత్తలు తీసుకుని మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యల చేపట్టాలి. ఇది మనందరి తప్పు. దీనికి ఒక వ్యక్తి బాధ్యత వహించడు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. హీరోయిన్ రష్మిక మందన్న, హీరో నితిన్‌, శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేనిలు ప్రభుత్వం ఫైర్ అయ్యారు. మరోవైపు దర్శకులు రాఘవేంద్ర రావు, త్రివిక్రమ్, రానా దగ్గుబాటి అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని మద్దతు తెలిపారు.


ఇక BRS నేతలు హరీష్ రావు, కేటీఆర్.. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, రాజా సింగ్, బండి సంజయ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

Updated Date - Dec 13 , 2024 | 09:26 PM